Mumbai Indians PlayOff Chances: ఐపీఎల్ 2024 లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ అవకాశాలున్నాయా
Mumbai Indians PlayOff Chances: ఐపీఎల్ 2024 మెగా టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. ఐదుసార్లు టైటిల్ గెల్చిన ముంబై ఇండియన్స్ కొత్త సారధి నేతృత్వంలో చతికిలపడుతోంది. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఉన్న సమీకరణాలేంటి, అసలా పరిస్థితి ఉందా లేదా తెలుసుకుందాం..
Mumbai Indians PlayOff Chances: ఐపీఎల్ 2024 సీజన్ 17 ఆరంభానికి ముందే ఏ జట్టూ ఎదుర్కోనంత ట్రోలింగ్ ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటూ వచ్చింది. ఇక టోర్నీ ప్రారంభమయ్యా ఆ ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. ట్రోలింగ్‌కు తగ్గట్టే ఆ జట్టు ఆటతీరు ఉంది. ఇప్పటి వరకూ కేవలం 6 పాయింట్లే సాధించిన ముంబైకు ప్లే ఆఫ్ చేరే పరిస్థితి ఉందా లేదా..
ఐపీఎల్ 2024 సీజన్ 17లో జట్టు యాజమాన్యం ఒక్కసారిగా కెప్టెన్‌ను మార్చి విమర్శలపాలైంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను తెచ్చుకుని రోహిత్ శర్మను పక్కనబెట్టి సారధ్య బాధ్యతలు అప్పగించింది. దాంతో సహజంగానే రోహిత్ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఒక్కసారిగా ముంబై ఇండియన్స్ జట్టుకు దూరమయ్యారు. ట్రోలింగ్ ప్రారంభించారు. భారీగా సోషల్ మీడియాలో అన్‌ఫాలో అవడం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా ఓ ఎత్తైతే టోర్నీ ప్రారంభం అయ్యాక ఆ జట్టు ఆటతీరు మరింత విమర్శలకు దారితీసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఓ రేంజ్‌లో ఆడుకోవడం ప్రారంభించారు నెటిజన్లు. హార్దిక్ పాండ్యా ఆట కూడా అలానే ఉంది.
ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకూ 8 మ్యాచ్‌లు ఆడగా కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి ఆరు పాయింట్లు దక్కించుకుంది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైంది. ఇప్పుడిక ముంబై ఇండియన్స్ ప్లే ఆప్ చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచ్‌లను భారీ రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంది. ఒక్క మ్యాచ్ ఓడినా ప్లే ఆఫ్ అవకాశాలు పోగొట్టుకుంటుంది. ఈ నెల 27న ఢిల్లీ కేపిటల్స్ జట్టుతోనూ, లక్నో సూపర్ జెయింట్స్‌తోనూ, మే 3న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతోనూ, 6వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతోనూ, 11న మరోసారి కేకేఆర్‌తోనూ, 17న లక్నో సూపర్ జెయింట్స్‌తోనూ తలపడనుంది.
ఈ ఆరు మ్యాచ్‌లు భారీ రన్‌రేట్‌తో గెలిస్తే 12 పాయింట్లు సాధించడం ద్వారా మొత్తం 18 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు చేరుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ముంబై ఇండియన్స్ ఫామ్ చూస్తుంటే ఇది దాదాపుగా అసాధ్యంగానే ఉంది.
Also read: IPL 2024 RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ నేడే, 300 రన్స్‌పై ఆరెంజ్ ఆర్మీ కన్ను
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook