IPL 2024 PBKS vs CSK Highlights: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో మిశ్రమ ఫలితాలు పొందుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో విజయం సాధించి ప్లేఆఫ్‌ ఆశలను మెరుగుపర్చుకోగా.. ఏడో విజయంతో పంజాబ్‌ కింగ్స్‌ ప్లే ఆఫ్‌ అవకాశాలు గల్లంతయ్యాయి. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై 28 పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. సాధారణ స్కోర్‌ మ్యాచ్‌ అయినా కూడా ఉత్కంఠగా సాగి ప్రేక్షకులకు వినోదం అందించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: India T20 World Cup Squad 2024: రోహిత్‌ సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు.. రాహుల్‌కు షాక్‌


టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌కు చెన్నై సూపర్‌ కింగ్స్‌ భారీ పరుగులు సాధించడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకు పరిమితమైంది. రవీంద్ర జడేజా 43 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ మోస్తారు స్కోర్‌ కూడా సాధించలేకపోయారు. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (32), డేరిల్‌ మిచెల్‌ (30), శార్దూల్‌ ఠాకూర్‌ (17), మొయిన్‌ అలీ (17) సాధారణ స్కోర్‌కు పరిమితమయ్యారు. అజింక్యా రహానే (9), మిచెల్‌ శాంట్నర్‌ (11) పరులుగు రాబట్టడంలో విఫలమయ్యారు. ఇక యువ ఆటగాడు శివమ్‌ దూబేతోపాటు సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోనీ డకౌట్‌ కావడం గమనార్హం. చెన్నైను బౌలింగ్‌తో పంజాబ్‌ ఇబ్బంది పెట్టింది. స్కోర్‌ బోర్డును నియంత్రిస్తూనే వికెట్లు పడగొట్టారు. రాహుల్‌ చాహర్‌, హర్షల్‌ పటేల్‌ మూడు వికెట్ల చొప్పున పడగొట్టి సత్తా చాటారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు, సామ్‌ కరాన్‌ ఓ వికెట్‌ తీశాడు.

Also Read: CSK vs SRH Highlights: కసి తీర్చుకున్న చెన్నై.. చేతులారా చేజార్చుకున్న హైదరాబాద్‌


సాధారణ స్కోర్‌ను ఛేదించడంలో పంజాబ్‌ కింగ్స్‌ విఫలమైంది. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌ను ఆల్‌ రౌండ్‌ వైఫల్యంతో చేజార్చుకుంది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి ఓటమిని ఖరారు చేసుకుంది. ప్రభుమన్‌ సింగ్‌, శశాంక్‌ సింగ్‌ మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ సాధారణ స్కోర్‌ కూడా సాధించలేకపోయారు. ప్రభుమన్‌ సింగ్‌ 23 బంతుల్లో 30 పరుగులు, శశాంక్‌ 27 స్కోర్‌ చేశాడు. జెన్నీ బైర్‌స్టో (7), కెప్టెన్‌ సామ్‌ కరాన్‌ (7), హర్షల్‌ పటేల్‌ (12), రాహుల్‌ చాహర్‌ (16) అతి తక్కువ పరుగులు చేశారు. రిలీ రూసో, జితేశ్‌ శర్మ ఘోరంగా విఫలమయ్యారు. వారిద్దరూ డకౌట్‌ అయి జట్టును ప్రమాదంలోకి నెట్టేశారు. కగిసో రబాడా (11), హర్‌ప్రీత్ బ్రార్‌ (17) మెరిసే ప్రయత్నం చేసినా జట్టు ఓటమి బాట పట్టింది.

చెన్నై బౌలర్లు కూడా రఫ్పాడించారు. ప్రత్యర్థి జట్టును పరుగులకు అడ్డుకట్ట వేస్తూనే వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్‌లో సత్తా చాటిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. తుషార్‌ దేశ్‌పాండే, సిమర్‌జీత్‌ సింగ్‌ రెండేసి వికెట్ల చొప్పున తీశారు. మిచెల్‌ శాంట్నర్‌, షార్దూల్‌ ఠాకూర్‌ చెరో వికెట్‌ తీసి జట్టును కీలక విజయం అందించారు.

పట్టికలో మార్పులు
ఈ విజయంతో చెన్నై సూపర్‌ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. పంజాబ్‌ కింగ్స్‌ మాత్రం 8 వ స్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌ ఫలితాలు పాయింట్ల పట్టికలో అనూహ్య మార్పులు చేసింది. 6వ విజయంతో చెన్నై మూడో స్థానానికి ఎగబాకగా.. నాలుగో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్థానం 5వ స్థానానికి పడిపోవడం గమనార్హం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter