IPL Points Table: పాయింట్ల పట్టికలో ఢిల్లీకి ప్రమోషన్.. సన్ రైజర్స్ స్థానం ఎంతంటే?
IPL 2024 Updates: బుధవారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ పై ఢిల్లీ గెలుపుతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ కొట్టిన దెబ్బకు కొన్ని జట్లు అట్టడగు స్థానానికి పడిపోయాయి.
IPL 2024 Points Table latest Update: ఐపీఎల్ సీజన్ 17 చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 32 మ్యాచులు ముగిశాయి. నిన్న గుజరాత్ పై ఢిల్లీ గెలవడం ద్వారా పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తొలి స్థానం ఎవరిది, అట్టడగున ఏ టీమ్ ఉందో తెలుసుకుందాం.
టాప్ లో కొనసాగుతున్న రాజస్థాన్..
రాజస్థాన్ రాయల్స్ ఎప్పటిలాగే అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన సంజూ సేన 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. 12 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆ జట్టు నెట్ రన్ రేట్ +0.677గా ఉంది. 6 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ 8 పాయింట్లు సాధించి..+1.399 నికర రన్ రేట్‌తో సెకండ్ ఫ్లేస్ లో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆరు మ్యాచుల్లో నాలుగు గెలిచి మూడో స్థానంలో ఉంది. ఎనిమిది పాయింట్ల సాధించిన సీఎస్కే +0.726 నెట్ రన్ రేట్ ను కలిగి ఉంది.
అదే స్థానంలో హైదరాబాద్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 8 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ టీమ్ +0.502 నికర రన్ రేట్ ను కలిగి ఉంది. పాయింట్ల టేబుల్ లో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్‌జెయింట్ 5వ స్థానంలో నిలిచింది. ఆరు మ్యాచ్‌లలో మూడు గెలిచి ఆరు పాయింట్లతో నికర రన్ రేట్ +0.038ను కలిగి ఉంది.
టాప్-6లోకి ఢిల్లీ..
నిన్న గుజరాత్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచి టాప్-6కు ఎగబాకింది. పంత్ సేన ఏడు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి 6 పాయింట్లతోపాటు -0.074 నెట్ రన్ రేట్ సాధించింది. గుజరాత్ టైటాన్స్ జట్టు 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి -1.303 రన్ రేట్ ను కలిగి ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టు ఆరు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి 4 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఆజట్టు రన్ రేట్ -0.218గా ఉంది. ముంబై ఇండియన్స్ జట్టు ఆరు గేమ్స్ లో రెండింటిలో గెలిచి నాలుగు పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది ప్రస్తుతం ఆ జట్టు రన్ రేట్ -0.234గా నిలిచింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడి.. 6 మ్యాచ్‌ల్లో ఓడి రెండు పాయింట్లతో అట్టడగున అంటే పదో స్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ నెట్ రన్ రేట్ -1.185గా నిలిచింది.
Also Read: IPL GT vs DC Highlights: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. గుజరాత్ టైటాన్స్‌కు దారుణ పరాభవం
Also Read: IPL KKR vs RR: బట్లర్ విధ్వంసంతో రాజస్థాన్ అద్భుత విజయం..నరైన్ శతకం వృథా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter