IPL 2024 Playoff Predictions: ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు ఆసక్తి రేపుతున్నాయి. దాదాపు అన్ని జట్లు రెండేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ తప్ప అన్ని జట్లు ఖాతా తెరిచాయి. ప్లే ఆఫ్‌కు ఎవరు చేరేది అప్పుడే చెప్పడం దాదాపు అసాధ్యమే అయినా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ప్లే ఆఫ్ జోస్యం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2024 సీజన్ 17 ప్రారంభమై ఇప్పటికి 14 మ్యాచ్‌లు జరిగాయి. మొత్తం పది ఫ్రాంచైజీలు ఇంకా ఏడేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఉన్న పాయింట్స్ ప్రకారం చెన్నై సూపర్‌కింగ్స్ కేకేఆర్, ఆర్ఆర్, గుజరాత్ టైటాన్స్ 4 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉంటే ఎస్ఆర్‌హెచ్, లక్నో, డీసీ, పంజాబ్, ఆర్సీబీలు ఒక్కో మ్యాచ్ గెలిచి 2 పాయింట్లు సాధించాయి. ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్‌లు ఆడి రెండింట్లోన ఓటమి పాలైంది. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. ఈ క్రమంలో ప్లే ఆఫ్‌కు గురించి అంచనా వేయడం తొందరే అవుతుంది. ఎందుకంటే దాదాపు అన్ని జట్లు ఇంకా 6-7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ప్లే ఆఫ్ అంచనాలు ఆశ్చర్యం కల్గిస్తున్నాయి. అనిల్ కుంబ్లే అంచనాల ప్రకారం...


రాజస్థాన్ రాయల్స్ జట్టు చాలా నిలకడగా ఆడుతూ రాణిస్తోందని, ఈసారి ప్లే ఆఫ్‌కు చేరడం ఖాయమని అనిల్ కుంబ్లే అంచనా వేశాడు. బౌలింగ్ , బ్యాటింగ్ రెండింట్లోనూ స్థిరంగా రాణిస్తోందన్నాడు. ప్లే ఆఫ్‌కు చేరే రెండో జట్టుగా అనిల్ కుంబ్లే ముంబై ఇండియన్స్‌కు చోటివ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంకా ఖాతా ఓపెన్ చేయని ముంబై ఇండియన్స్ జట్టులో అన్ని లోపాలు కన్పిస్తున్నా ప్లే ఆఫ్ కు చేరుతుందని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ప్రారంభ మ్యాచ్‌లలో ఓడినా తరువాత కోలుకున్న సందర్భాలున్నాయంటున్నాడు. 


ఇక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన కేకేఆర్ జట్టు శక్తివంతమైన జట్టుగా ఉంది. ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో కేకేఆర్ ప్లే ఆఫ్‌కు చేరవచ్చంటున్నాడు అనిల్ కుంబ్లే. ఇక ప్లే ఆఫ్‌కు చేరే నాలుగో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అవకాశమిచ్చాడు. టైటిల్ ఫేవరెట్ కావచ్చని కూడా అంటున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ అన్నింటినీ ప్లే ఆఫ్‌లో చోటివ్వకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. 


Also read: Virat Kohli: నెట్టింట విరాట్ కోహ్లీ మొబైల్ నంబర్ లీక్.. కాల్ చేసి మాట్లాడాలని ఉందా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook