RCB vs PBKS Live Score: చెలరేగిన ధావన్, జితేశ్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?
RCB vs PBKS Live Score: కెప్టెన్ శిఖర్ ధావన్, జితేశ్ శర్మ రాణించడంతో.. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో 176 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.
IPL 2024, RCB vs PBKS Live Score: చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో మెుదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఓ మోస్తరు స్కోరు సాధించింది. కెప్టెన్ శిఖర్ ధావన్(45), జితేశ్ శర్మ(27) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవరల్లో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.
దెబ్బతీసిన సిరాజ్.. చెలరేగిన ధావన్..
టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలు త బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ ను సిరాజ్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. రెండు బౌండరీలు బాది మాంచి ఊపు మీదున్న బెయిర్‌స్టో(8) మూడో బంతికి ఔట్ చేసి బెంగళూరుకు బ్రేక్ ఇచ్చాడు. దాంతో 17 పరుగుల వద్ద కింగ్స్ తన తొలి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత ప్రభ్‌సిమ్రాన్ తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు ధావన్. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించారు.
ఆదుకున్న కరన్, జితేశ్..
ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని మ్యాక్స్‌వెల్ ఔట్ చేసి కింగ్స్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు. కాసేపటికే లివింగ్‌స్టోన్(17)ను అల్జారీ జోసెఫ్ ఔట్ చేశాడు. దీంతో 98 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పంజాబ్ ను సామ్ కరన్(23), జితేశ్ శర్మ(27)లు ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 52 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత దయాల్, సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కింగ్స్ కు పరుగులు రావడం కష్టమైంది. అయితే జోసెఫ్ వేసిన చివరి ఓవర్ లో శశాంక్ సింగ్(21 నాటౌట్) చెలరేగి ఆడాడు. రెండు సిక్సర్లు, ఫోర్ బాది జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
Also Read: Holi 2024: రంగుల్లో మునిగి తేలిన టీమిండియా క్రికెటర్లు.. వైరల్ అవుతున్న వీడియోలు..
Also Read: IPL 2024 full schedule: ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది... ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి