IPL 2024 RCB vs PBKS: ఐపీఎల్‌లో లీగ్ మ్యాచ్‌లు మరి కొద్దిరోజుల్లో పూర్తి కానున్నాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్ సమీకరణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్లే ఆఫ్ బరి నుంచి తప్పుకుంది. ఇక ఇవాళ ధర్మసాళలో జరిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్ మ్యాచ్‌లో మరో జట్టు ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించనుంది. ప్లే ఆఫ్ బరి ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ రెండు జట్లకు ఇవాళ్టి మ్యాచ్ కీలకం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేకేఆర్, రాజస్థాన్ జట్లు 11 మ్యాచ్‌లు ఆడి చెరో 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకునేలా ఉన్నాయి. ఇక మూడవ ప్లే ఆఫ్ బెర్త్ 12 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుు కైవసం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ జట్టుకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలాయి. ఇక నాలుగో ప్లే ఆఫ్ బెర్త్ కోసం చెన్నై సూపర్‌కింగ్స్, , ఢిల్లీ కేపిటల్స్, లక్నోసూపర్ జెయింట్స్ జట్లు పోటీ పడవచ్చు. అదే సమయంలో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే చెరో 11 మ్యాచ్‌లు ఆడి 8 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ ఈ రెండు జట్లకు కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇక ప్లే ఆఫ్ ఆశలు వదులుకోవల్సిందే. గెలిచిన జట్టుకు ఇంకా అవకాశముంటుంది.


ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ లెవెన్ వర్సెస్ ఆర్సీబీ 32 సార్లు తలపడగా 15 మ్యాచ్‌లలో ఆర్సీబీ, 17 మ్యాచ్‌లలో పంజాబ్ విజయం సాధించాయి. ఆర్సీబీ ఈ మ్యాచ్ తరువాత తదుపరి రెండు మ్యాచ్‌లను ముంబై, గుజరాత్‌లతో ఆడాల్సి ఉంది. అదే పంజాబ్ మాత్రం పటిష్టంగా ఉన్న రాజస్థాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో తలపడాల్సి ఉంది. 


పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు


జానీ బెయిర్ స్టో, రిలీ రొస్సో, శశాంక్ సింగ్, సామ్ కర్రన్, జితేష్ శర్మ, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రబడ, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్


ఆర్సీబీ జట్టు


విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, విల్ జాక్స్, కామెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్, కర్ణ శర్మ, స్వప్నిల్ సింగ్, యశ్ దయాల్, విజయ్ కుమార్ వైశాఖ్, మొహమ్మద్ సిరాజ్, రజత్ పాటిదార్


Also read: Muslim Reservations: ముస్లిం రిజర్వేషన్లు తీసి ఆ వర్గాలకిచ్చేస్తాం, అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook