IPL 2024, RR vs LSG Match Highlights: ఉత్కంఠ పోరులో రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals)ను విజయం వరించింది. చివరి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ లో సంజూ సేన ప‌రుగుల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌(LSG)పై గెలుపొందింది. కెప్టెన్ సంజూ శాంస‌న్(82 నాటౌట్), రియాన్ ప‌రాగ్‌(43)లు మెరుపులతో భారీ స్కోరు సాధించింది రాజస్థాన్. ఆ తర్వాత లక్నో బ్యాటర్లు నికోల‌స్ పూరన్(64 నాటౌట్), కెప్టెన్ కేఎల్ రాహుల్(58) చెలరేగినా.. చివర్లో రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా పుంజుకుని లక్నోను కట్టడి చేశారు. దీంతో ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెలరేగిన సంజూ, పరాగ్..
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ అందించిన మంచి ఆరంభాన్ని ఆ జట్టు బ్యాటర్లు సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా సంజూ శాంసన్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో ఆదరగొట్టాడు. అతడికి పరాగ్ మెరుపులు కూడా తోడవ్వడంతో రాజస్థాన్ జట్టు భారీ స్కోరు అందించింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్-హక్ రెండు వికెట్లు తీశాడు. 


రాహుల్, పూరన్ మెరుపులు..
194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోను ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరిగే బంతులతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆదిలోనే డికాక్, పడిక్కల్ వికెట్లను తీశాడు.  దీంతో డ్వికాక్ కేవలం నాలుగు పరుగులకే ఔటవ్వగా..దేవదత్ పడిక్కల్ సున్నా పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చి ఆయుష్ బ‌దౌనీ కూడా కేవలం ఒకే ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. మరోవైపు రాహుల్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకపడ్డాడు. అతడికి దీపక్ హుడా కలవడంతో స్కోరు బోర్డు రాకెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. డేంజరస్ గా మారుతున్న ఈ జోడిని చాహల్ విడదీశాడు. 26 పరుగులు చేసిన హుడాను అతడు పెవిలియన్ కు చేర్చాడు. అనంతరం రాహుల్ కు జతకలిసిన పూరన్ ల‌క్నో బౌల‌ర్ల‌పై విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. రాహుల్ ను సందీప్ శర్మ ఔట్ చేయడంతో లక్నో ఆశలు గల్లంతయ్యాయి. పూరన్ చివరి వరకు ఉన్నప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. 


Also Read: RR vs LSG Live Score : శాంసన్, పరాగ్ మెరుపులు.. లక్నో ముందు భారీ లక్ష్యం..


Also Read: Nitish Rana: రెచ్చగొడితే రచ్చరచ్చే.. ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చిన బౌలర్‌కు భారీ జరిమానా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి