IPL 2024 Live RR vs MI : ఐపీఎల్‌లో తిరుగులేని రారాజు `రాజస్థాన్`.. యశస్వి జైస్వాల్ దెబ్బకు ముంబై ఓటమి

IPL Live Rajasthan Royals Beat Mumbai Indians By 9 Wickets: ఈ ఐపీఎల్ సీజన్లో రారాజుగా నిలుస్తున్న రాజస్థాన్ రాయల్స్ 7వ విజయంతో తనకు తాను తిరుగులేదనిపించింది. ముంబై ఇండియన్స్ అతితక్కువ స్కోర్‌ను కాపాడుకోలేక ఓటమిపాలైంది.
RR vs MI Highlights: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ తిరుగులేని చరిత్ర సృష్టిస్తోంది. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ఆ జట్టును ముంబై ఇండియన్స్‌ను కూడా మట్టికరిపించి 7వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ ప్లేఆఫ్స్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. వర్షం అడ్డంకితో ఆలస్యంగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అతి తక్కువ స్కోర్‌ను కాపాడుకోలేక ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. ఓటమితో ముంబై 7వ స్థానానికి పడిపోయింది.
Also Read: PBKS vs GT Highlights: పుంజుకున్న గుజరాత్.. ఆఖరి మెట్టులో పంజాబ్‌కు మరో ఓటమి
స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ యశస్వి జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్‌తో భారీ విజయం సొంతం చేసుకుంది. 18.4 ఓవర్లలో వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసి విజయం సాధించింది. పవర్ ప్లే ముగిసిన అనంతరం కొద్దిసేపు వర్షం అడ్డంకి సృష్టించినా తర్వాత మ్యాచ్ కొనసాగింది. ఓపెనర్‌గా దిగిన యశస్వి జైస్వాల్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 60 బంతుల్లో 104 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. జోస్ బట్లర్ 35 పరుగులతో పర్వాలేదనిపించగా.. కెప్టెన్ సంజు శాంసన్ 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
Also Read: RCB IPl 2024 Play Off Chances: బెంగళూరుకు ఈసారి 'కప్' దూరమే! కోహ్లీకి ఇక మిగిలింది తీవ్ర నిరాశే
బ్యాటర్లు చేసిన తక్కువ పరుగులను బౌలర్లు కాపాడలేకపోయారు. పీయూష్ చావ్లా ఒక్క వికెట్ మినహా మరెవరూ కూడా వికెట్ తీయలేకపోయారు. మరోసారి ముంబై ఇండియన్స్ బౌలింగ్‌ను పేలవ ప్రదర్శన కొనసాగింది. ఫీల్డింగ్‌లో తప్పిదాలతో ముంబై భారీ నష్టాన్ని చవిచూసింది. అన్ని అంశాల్లో ఫెయిలైన ఎంఐ మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక్క పరుగు చేయకుండా వెళ్లిపోగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 6 పరుగులకే పరిమితమవగా.. సూర్యకుమార్ యాదవ్ 10 మత్రమే చేశాడు. తెలంగాణ ఆటగాడు తిలక్ వర్మ సంచలన ప్రదర్శన చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తనదైన బ్యాటింగ్‌తో ముంబైని ఆదుకున్నాడు. 45 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టు పరువు కాపాడాడు. మహ్మద్ నబీ (23) పర్వాలేదనిపించగా.. నేహాల్ వధేరా 49తో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 10 పరుగులే చేయగా.. మిగతా వాళ్లు తక్కువే స్కోర్ చేశారు.
ముంబై ఇండియన్స్‌ను పరుగులు సాధించకుండా రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. సందీప్ శర్మ బంతితో మాయ చేసి 5 వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. వేసిన నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి ముంబైను దెబ్బతీశాడు. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ చెరొక వికెట్ పడగొట్టారు. కాగా ఐపీఎల్‌లో యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. 23 ఏళ్లకే ఐపీఎల్‌లో రెండు సెంచరీలు చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter