IPL 2024, RR vs RCB Match Highlights: హోం గ్రౌండ్ లో బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. రాజస్థాన్ బ్యాటర్ సెంచరీతో చెలరేగాడు. 58 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లుతో 100 పరుగులు చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజస్థాన్ రాయల్స్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా కోహ్లీ రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోశాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి తరలించాడు. మరోవైపు డుప్లెసిస్ కూడా రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 125 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పాడు. 


సెంచరీతో చెలరేగిన కోహ్లీ..
అనంతరం క్రీజులోకి వచ్చిన మాక్సెవెల్, సౌరవ్ చౌహాన్ కూడా స్వల్పస్కోరుకే వెనుదిరిగారు. మరోవైపు చివరి వరకు తన దూకుడును కొనసాగించిన కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ సాధించాడు. ఈ సీజన్ లో తొలి శతకవీరుడుగా కోహ్లీ అవతరించాడు. విరాట్ కు ఇది ఎనిమిదో ఐపీఎల్ సెంచరీ. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. చివరి వరకు నాటౌట్ గా నిలిచిన కోహ్లీ 72 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 113 పరుగులు చేశాడు. చాహల్ రెండు వికెట్లు తీశాడు. 


దంచి కొట్టిన బట్లర్, సంజూ..
రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిర్దేశించిన 184 ప‌రుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజ‌స్థాన్‌కు తొలి ఓవ‌ర్‌లోనే షాక్ త‌గిలింది. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లో కూడా డకౌట్ అయ్యాడు. జైస్వాల్ ను టోప్లే ఔట్ చేశాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ తో కలిసి కెప్టెన్ సంజూ శాంసన్ ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని సిరాజ్ విడదీశాడు. మాంచి ఊపుమీదున్న శాంసన్ ను ఔట్ చేసి ఆర్సీబీకి బ్రేక్ ఇచ్చాడు. 42 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 69 పరుగులు చేసి ఔటయ్యాడు. 


ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్ నాలుగు పరుగులకే ఔటయ్యాడు. దీంతో రాజస్థాన్ 155 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం జురెల్ కూడా రెండు పరుగులకే ఔటయ్యాడు. హెట్మియిర్ తో కలిసి మిగతా పనిని పూర్తి చేశాడు బట్లర్. సిక్స్ తో సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా జట్టుకు విజయాన్ని కూడా అందించాడు. దీంతో రాజస్థాన్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. 


Also Read: RR vs RCB Live Score: శతక్కొట్టిన కోహ్లీ.. రాజస్థాన్ రాయల్స్ ముందు కొండంత లక్ష్యం..


Also Read: IPL 2024: బెంగళూరుతో మ్యాచ్ కు పింక్ జెర్సీలతో బరిలోకి రాజస్థాన్.. కారణం తెలిస్తే సెల్యూట్ చేస్తారు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook