Rajasthan Royals vs Royal Challengers Bengaluru Match Preview: ఐపీఎల్ 17వ సీజన్ లో రేపు కీలక పోరుకు తెరలేవనుంది. ఏప్రిల్ 06న రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ హ్యాట్రిక్ విజయాలు సాధించి ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిపోయి ఒకటి మాత్రమే గెలిచింది ఆర్సీబీ. ఈ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ లో రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు జట్లు ఇప్పటి వరకు 30 సార్లు తలపడ్డాయి. ఇందులో బెంగళూరు 15 మ్యాచ్‌లు గెలుపొందగా.. రాజస్థాన్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. 2020 నుండి ఆ రెండు జట్లు 9 సార్లు తలపడగా.. రాజస్థాన్ కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలుపొందింది. 2022లో చివరిసారిగా బెంగళూరుపై రాజస్థాన్ విజయం సాధించింది. రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ అద్భుతంగా ఆడటమే జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అయితే జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ ఫామ్ లోకి రావాల్సి ఉంది. షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్ రాణించడం ఆ జట్టుకు కలిసొచ్చే ఆంశం. బౌలింగ్ లో చాహల్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, కుల్దీప్ వంటి బౌలర్లు ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే ఆంశం. బెంగళూరు జట్టులో కోహ్లీ, దినేష్ కార్తీక్ బ్యాట్ ఝలిపిస్తన్నారు. కెప్టెన్ డుప్లెసిస్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. 


ఇరు జట్లు ఫ్లేయింగ్ XI ఇదే..
రాజస్థాన్ ఫ్లేయింగ్ XI: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, నాంద్రే బర్గర్, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్. 
బెంగళూరు ఫ్లేయింగ్ XI: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కెమెరూన్ గ్రీన్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, మయాంక్ దాగర్, రీస్ టోప్లీ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.


మెుత్తం జట్టు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్(వికెట్ కీపర్), మయాంక్ డాగర్, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, మహిపాల్ లోమ్రోర్, సుయాష్ ప్రభుదేస్ , కర్ణ్ శర్మ, విజయ్‌కుమార్ వైషాక్, స్వప్నిల్ సింగ్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, అల్జారీ జోసెఫ్, విల్ జాక్స్, మనోజ్ భాండాగే, ఆకాష్ దీప్, సౌరవ్ చౌహాన్, రాజన్ కుమార్, హిమాన్షు శర్మ 
రాజస్థాన్ రాయల్స్ జట్టు: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్(w/c), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, నాంద్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్, రోవ్‌మన్ పావెల్, తనుష్ సేన్ కోటియన్, కుల్దీప్ కోటియన్ , శుభమ్ దూబే, అబిద్ ముస్తాక్, కునాల్ సింగ్ రాథోడ్, డోనోవన్ ఫెరీరా, టామ్ కోహ్లర్-కాడ్మోర్, కేశవ్ మహారాజ్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ.


Also Read: IPL 2024 Updates: గుజ‌రాత్ టైటాన్స్ కు బిగ్ షాక్.. గాయంతో స్టార్ హిట్ట‌ర్‌ దూరం..


Also read: SRH Vs CSK: హైదరాబాద్‌, చెన్నై మ్యాచ్‌ టికెట్ల లొల్లి.. మండిపడిన మాజీ క్రికెటర్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook