IPL 2024 SRH vs CSK: ఐపీఎల్ 20248లో రెండు దక్షిణాది జట్ల మద్య ఆసక్తికర మ్యాచ్‌కు హైదరాబాద్ వేదికగా మారింది. చెరో మూడేసి మ్యాచ్‌లు ఆడిన రెండు జట్లు నాలుగో మ్యాచ్‌లో విజయం కోసం హోరాహోరీ పోటీ పడనున్నాయి. మూడు మ్యాచ్‌లు ఆడి రెండింట విజయం సాధించిన సీఎస్కే ఓ వైపు..మూడు మ్యాచ్‌లలో ఒక మాచ్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోవైపు ఉన్నాయి. ఈ క్రమంలో ఏ జట్టు బలం ఎలా ఉంది, ప్లేయింగ్ 11 అంచనాలు, ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని విరుచుకుపడినా ఢిల్లీ కేపిటల్స్ చేతిలో చతికిలపడింది. అటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేకేఆర్‌తో ఓటమితో ప్రారంభించినా 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి వరకూ ప్రయత్నించింది. హెన్రిచ్ క్లాసిన్ విధ్వంసర బ్యాటింగ్‌తో విజయం చివరి వరకూ వచ్చి చేజారింది. ఆ తరువాత ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ సత్తా ఏంటో చాటిచెప్పింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రన్ స్కోర్ 277 పరుగులు సాదించి విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత గుజరాత్ టైటాన్స్‌తో మూడో మ్యాచ్ ఓడిపోయింది. 


సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన గత ఐదు ఐపీఎల్ మ్యాచ్‌లలో నాలుగింట చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తే కేవలం ఒక మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. 2020లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఓసారి, 6 వికెట్ల తేడాతో మరోసారి ఎస్ఆర్‌హెచ్‌పై సీఎస్కే విజయం సాధించింది. ఐపీఎల్ 2022లో మాత్రం ఎస్ఆర్‌హెచ్ జట్టు సీఎస్కేపై 8 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. తిరిగి 2022లోనే సీఎస్కే 13 పరుగుల తేడాతో 2023లో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై గెలిచింది. 


సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 అంచనా


మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాద్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, మయాంక్ మార్కండే


చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 అంచనా


రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డేరిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వి, ఎంఎస్ ధోని, దపక్ చాహర్, మహీష్ తీక్షణ, మతీషా పతిరాణ, తుషార్ దేశ్ పాండే


Also read: IPL 2024 PBKS vs GT: ఒక్కోసారి పొరపాట్లే ఊహించని విజయాన్ని అందిస్తాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook