IPL 2024 SRH vs MI: ఐపీఎల్ సీజన్ 17లో ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్ రెండు జట్లకు కీలకం. కేకేఆర్ చేతిలో ఎస్ఆర్‌హెచ్, జీటీ చేతిలో ఎంఐ తొలి మ్యాచ్‌లో ఓడిపోయాయి. ఇప్పుడు ఈ మ్యాచ్ విజయంతో టైటిల్ వేట ప్రారంభించాలని యోచిస్తున్నాయి. కమిన్స్ వర్సెస్ హార్దిక్ సేనల్లో ఎవరి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2024 సీజన్ 17 రసవత్తరంగా నడుస్తోంది. వరుస రెండు విజయాలతో 4 పాయింట్లతో చెన్నై సూపర్‌కింగ్స్ అగ్రస్థానంలో ఉండగా మిగిలిన జట్లు పంజాబ్, కేకేఆర్, ఆర్ఆర్, ఆర్సీబీ, జీటీలు ఒక్కో మ్యాచ్ విజయంతో రెండేసి పాయింట్లు సాధించాయి. ఇక ఇవాళ హైదరాబాద్ వేదికగా జరగనున్న ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అత్యంత ఆసక్తి రేపుతోంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారధ్యంలోని ముంబై ఇండియన్స్ ..గుజరాత్ టైటాన్స్ చేతిలో చేజేతులారా ఓడిపోయి అపప్రద మూటగట్టుకుంది. ఎందుకంటే విధ్వంసకర బ్యాటర్లు ఉన్న ఎంఐ..36 బంతుల్లో 48 బంతులు చేయలేకపోవడం శోచనీయం. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం, బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు ఇవ్వడమే కాకుండా ఫీల్డ్ సెట్టింగులో రోహిత్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇషాన్ కిషన్ విఫలమయ్యాడు. రోహిత్ రాణించినా మిగిలిన బ్యాటర్లు సహకరించలేదు. మంచి ఆటగాళ్లున్నా సరైన ప్రదర్శన కనబర్చలేకపోయారు. 


మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ ఓడినా అందర్నీ ఆకట్టుకుంది. అసాధ్యమైన 208 పరుగుల లక్ష్యాన్ని దాదాపు ఛేదించినంత పనిచేసింది. అది కూడా చివరి 4 ఓవర్లలో మ్యాచ్ ఫలితాన్ని మార్చేసే బ్యాటింగ్‌తో అందర్నీ ఆకర్షించింది. హెన్రిచ్ క్లాసెన్ అద్భుత బ్యాటింగ్, మయాంక్ అగర్వాల్-అభిషేక్ శర్మ ఓపెనింగ్, ఎయిడెన్ మార్క్‌రమ్ మిడిల్ ఆర్డర్ పవర్ మరోసారి రాణిస్తే ఎస్ఆర్‌హెచ్‌కు తిరుగు ఉండదు. అదే సమయంలో భువనేశ్వర్ కుమార్ రాణిస్తే ప్యాట్ కమిన్స్ సేన చేతిలో ముంబై ఇండియన్స్‌కు తిప్పలు తప్పవు. 


Also read: CSK Vs GT Match: శుభ్‌మన్‌గిల్‌పై రుతురాజ్‌ పైచేయి.. చెన్నైకి రెండో ఘన విజయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook