IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ 17 మొదటి మ్యాచ్ చెన్నై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. సొంత పిచ్‌పై పట్టు కలిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఎదుర్కోవడం ఆర్సీబీకు అంత సులభం కాదు. అయితే ఈసారి బీసీసీఐ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. అ కొత్త రూల్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 స్మార్ట్ రీప్లే ..ఈసారి సీజన్ 17లో బీసీసీఐ కొత్త టెక్నాలజీ అమలు చేయనుంది. అంపైర్లు తీసుకునే నిర్ణయాల్లో మరింత కచ్చితత్వం, వేగం పెంచేందుకు ఐపీఎల్ 2024 నుంచి స్మార్ట్ రీప్లే సిస్టమ్ అమలు కానుంది. అంటే ఇద్దరు హాక్ ఐ ఆపరేటర్లు టీవీ అంపైర్ ఉండే గదిలోనే ఉంటారు. ఫీల్డ్ అంతటా ఉన్న 8 హాక్ ఐ స్పీడ్ కెమేరాల్నించి వచ్చే ఫుటేజ్‌ను తక్షణం అందిస్తారు. 


2. రెండు బౌన్సర్లు..ఇక ఈ నిబంధన పేసర్లకు అనుకూలంగా ఉండనుంది. ఒక ఓవర్‌కు రెండు బౌన్సర్ల వరకూ వేసేందుకు అనుమతి ఉంటుంది. ఇప్పటి వరకూ ఒక ఓవర్ ఒకే బౌన్సర్ అవకాశముండేది. ఓవర్‌కు రెండు బౌన్సర్ల నిబంధనను ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రవేశపెట్టారు. ఇక నుంచి ఈ రూల్ ఐపీఎల్‌లో ఉంటుంది. 


3. నో స్టాప్ క్లాక్..వాస్తవానికి ఐసీసీ త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు స్టాప్ క్లాక్ రూల్ ప్రవేశపెడుతోంది. అంటే ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకన్లకు మించి గ్యాప్ ఉండకూడదు. దీనికోసం స్టాప్ క్లాక్ ఉపయోగిస్తారు. ఒక ఇన్నింగ్స్‌లో మూడు సార్లు స్టాప్ క్లాక్ రూల్ బ్రేక్ చేస్తే బౌలింగ్ టీమ్‌కు 5 పరుగులు పెనాల్టీతో బ్యాటింగ్ టీమ్‌కు జత చేస్తారు. ఈ రూల్ ఐపీఎల్ 2024లో అమలు చేయడం లేదు. 


4. స్టంపింగ్ క్యాచ్ చెక్...ఐపీఎల్ 2024లో స్టంపింగ్ క్యాచ్ చెక్ విదానం అమలు చేయనుంది బీసీసీఐ. అంటే స్టంపింగ్ కోసం రిఫరల్ అభ్యర్దిస్తే క్యాచ్ చెక్ చేయనున్నారు. వాస్తవానికి ఈ రూల్ ఐసీసీలో లేదు గానీ ఐపీఎల్‌లో బీసీసీఐ అమలు చేయనుంది. 


Also read: AP DSC 2024: ఏపీ డీఎస్సీ నిలిపివేతకు హైకోర్టు నో, ఇప్పుడిక నిర్ణయం ఈసీ చేతిలోనే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook