SRH vs GT Live Score: మరోసారి చెలరేగిన అభిషేక్... గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
IPL 2024 Live today: గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ తడబడింది. ముంబైతో మ్యాచ్ లో రికార్డు స్థాయి స్కోరు చేసిన ఎస్ఆర్ హెచ్ జట్టు ఈ మ్యాచ్ లో మాత్రం ఓ మోస్తరు స్కోరుతో సరిపెట్టుకుంది. అభిషేక్ శర్మ మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
IPL 2024, SRH vs GT Live Score: గత మ్యాచ్ లో వీరబాదుడు బాదిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి తడబడింది. గుజరాత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కోలేక చతికిల పడింది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులే చేసి గిల్ సేనకు ఓ మోస్తర్ టార్గెట్ ను ఇచ్చింది.
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌కు మాయంక్ ఆగర్వాల్, ట్రావిసె హెడ్ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. అయితే వీరిద్దరి స్వల్ప వ్యవధిలో ఔట్ అయ్యారు. మయాంక్ 14, హెడ్ 19 పరుగులు చేసి ఔటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ మరోసారి బ్యాట్ ఝలిపించాడు. మార్క క్రమ్ తో కలిసి మూడో వికెట్ కు విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. మాంచి జోరు మీదున్న అభిషేక్ (29)ను మోహిత్ శర్మ ఔట్ చేసి గుజరాత్ కు బ్రేక్ ఇచ్చాడు.
మారక్రమ్ కు జత కలిసిన క్లాసెన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వచ్చి రాగానే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 13 బంతుల్లోనే ఫోర్, రెండు సిక్సర్లతో 24 పరుగులు చేసి రషీద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. వెంటనే మారక్రమ్ కూడా పెవిలియన్ చేరాడు. చివర్లో అబ్దుల్ సమద్ మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ అతడికి సహకరించే వారు కరవయ్యారు. దీంతో సమద్ 14 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్సర్ తో 29 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లు తీశాడు.
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI:
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI:
మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి