IPL 2024 SRH vs GT Prediction: ఆరెంజ్ ఆర్మీతో గుజరాత్ టైటాన్స్ పోరు నేడే, జట్టు బలాబలాలు, ప్లేయింగ్ 11

IPL 2024 SRH vs GT Prediction: ఐపీఎల్ 2024 సీజన్ 17 రసవత్తరంగా కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఇవాళ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియం సాక్షిగా జరగనుంది. ఈ మ్యాచ్‌పై రెండు జట్ల బలాబలాలు, డ్రీమ్ 11 అంచనాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 31, 2024, 06:05 AM IST
IPL 2024 SRH vs GT Prediction: ఆరెంజ్ ఆర్మీతో గుజరాత్ టైటాన్స్ పోరు నేడే, జట్టు బలాబలాలు, ప్లేయింగ్ 11

IPL 2024 SRH vs GT Prediction: ఐపీఎల్ 2024 లో 12వ మ్యాచ్ ఇవాళ జరగనుంది. చెన్నై చేతిలో పరాజయం తరువాత ముంబై ఇండియన్స్‌పై గెలిచిన గుజరాత్ టైటాన్స్‌కు ముంబై ఇండియన్స్‌పై భారీ స్కోరుతో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్య జరగనుంది. రెండు జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడి ఒక్కో మ్యాచ్ గెలిచి మూడో మ్యాచ్‌లో పరస్పరం తలపడనున్నాయి. 

మొదటి మ్యాచ్‌లో ఓడినా చివరి బంతి వరకూ పోరాడి 204 పరుగుల చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింంగ్ లో విధ్వంసం రేపుతోంది. ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఆ జట్టు క్రికెటర్లు బ్యాటింగ్ చూస్తే అదే అన్పిస్తుంది. 277 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్ది ముందు ఉంచారు. హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, , 
ఎయిడెన్ మార్క్‌రమ్‌ల విధ్వంసకర ఆటతో ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉందని చెప్పవచ్చు. ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్ తదితర బౌలర్లు మాత్రం ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉంది. ఓవర్లు పొదుపుగా చేయగలిగితే మంచి ఫలితాలుంటాయి. 

ఐపీఎల్‌లో 12వ మ్యాచ్ ఇది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియంలో మద్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఎప్పటిలానే జియో సినిమా, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. రెండు జట్లలో ట్రేవిస్ హెడ్ , అభషేక్ శర్మ, శుభమన్ గిల్, సాయి సుదర్శన్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు హెన్రిచ్ క్లాసెన్ మంచి ఆయుధంలా మారాడు. తొలి రెండు మ్యాచ్ లలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కేకేఆర్‌పై 29 బంతుల్లో 63 పరుగులు చేస్తే ముంబైపై 34 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు శుభమన్ గిల్‌పై భారీగా ఆశలు పెట్టుకుంది. 

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11 అంచనా

వృద్ధిమాన్ సాహా, శుభమన్ గిల్, అజ్మతుల్లా ఓమర్జాయ్, దేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11

మయాంగ్ అగర్వాల్, ట్రేవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్

Also read: LCG Vs PBKS Highlights: మయాంక్ యాదవ్ మెరుపు బౌలింగ్.. పంజాబ్‌కు లక్నో పంచ్.. ఉత్కంఠభరిత పోరులో ధావన్ సేన ఓటమి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News