IPL 2024 Updates: ఐపీఎల్ 2024 వేలంలో అన్ని ఫ్రాంచైజీల దృష్టి ఆ ఆరుగురిపైనే, భారీగా ధర పలకనున్న ట్రేవిస్ హెడ్
IPL 2024 Updates: ఐపీఎల్ 2024 వేలానికి సంబంధించి కీలకమైన ప్రక్రియ ముగిసింది. ఇప్పుడిక అన్ని ఫ్రాంచైజీలు వేలానికి సిద్ధమౌతున్నాయి. ఈసారి వేలంలో అన్ని జట్లు ప్రపంచకప్ హీరోలపై దృష్టి సారించనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024 Updates: ఐపీఎల్ 2024 కంటే ముందే అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ ఫ్రాంచైజీల రిలీజ్ అండ్ రిటెన్షన్ జాబితాలు వచ్చేశాయి. ఆటగాళ్ల ట్రేడింగ్ విండో కూడా పూర్తయింది. ఇక మిగిలింది వేలం మాత్రమే. మరి ఈసారి వేలంలో ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనే వివరాలతో పాటు కొత్తగా వేలంలో చేరనున్న ప్రపంచకప్ హీరోలపై ఆసక్తి పెరుగుతోంది.
ఐపీఎల్ 2024 కు ముందు డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా కీలకమైన మెగా వేలం జరగనుంది. ఇందులో భాగంగా ఐపీఎల్‌లోని మొత్తం 10 ఫ్రాంచైజీలు నిన్న చివరి రోజున ఏయే ఆటగాళ్లను విడుదలు చేస్తున్నది, ఎవరిని కొనసాగిస్తున్నదనే వివరాలతో జాబితాలు బీసీసీఐకు సమర్పించాయి. ఈసారి అన్ని జట్లు భారీగానే ఆటగాళ్లను విడుదల చేయడంతో ఈసారి వేలం గట్టిగానే ఉండబోతోంది. అదే సమయంలో ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో హీరోలుగా నిలిచిన కొందరు ఆటగాళ్లపై అన్ని ఫ్రాంచైజీలు ప్రత్యేక దృష్టి నెలకొల్పనున్నాయి.
ప్రపంచకప్‌లో అద్బుత ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ స్టార్క్ తిరిగి ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వడంతో అన్ని ఫ్రాంచైజీలు అతనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. అదే విధంగా మరో ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఆడమ్ జంపా కోసం వేలంలో పోటీ ఉండబోతోంది. ఇక ప్రపంచకప్‌లో హీరోగా నిలిచిన ఆల్‌రౌండర్ ట్రేవిస్ హెడ్ కోసం తీవ్రంగా పోటీ ఉండవచ్చు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింట్లోనూ ట్రేవిస్ హెడ్ అద్భుతంగా రాణించడమే ఇందుకు కారణం. అద్భుతమైన నాయకత్వ పటిమలో ఆస్ట్రేలియాకు కప్ అందించిన ప్యాట్ కమ్మిన్స్‌పై కూడా ఫ్రాంచైజీలు దృష్టి పెడుతున్నాయి.
ఇక న్యూజిలాండ్ ఆటగాళ్లు డారిలి మిచెల్, రచిన్ రవీంద్రల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడటం ఖాయం. ప్రపంచకప్ టోర్నీలో ఈ ఇద్దరి ప్రదర్శన అద్భుతం. ఇక దక్షిణాఫ్రికాకు చెందిన పేసర్ అండ్ ఆల్ రౌండజర్ గెరాల్డ్ కోయెట్జీ కోసం భారీగా వేలం ఉండవచ్చు.
Also read: IPL 2024 SRH List: భారమైన ఆటగాళ్లను వదిలించుకున్న ఎస్ఆర్‌హెచ్, బ్రూక్‌కు గుడ్ బై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook