IPL 2024, CSK vs MI: ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ముంబై ఇండియన్స్ (MI)పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో హార్దిక్ సేన నాలుగో ఓటమిని చవిచూసింది. తాజా పరాజయంతో ముంబై జట్టు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి దిగజారింది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఆరు మ్యాచ్‌లు ఆడగా కేవలం రెండు మ్యాచుల మాత్రమే గెలిచింది. చెన్నైతో మ్యాచ్ లో రోహిత్ సెంచరీ చేసినప్పటికీ ముంబై ఓడిపోవడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లైఫ్ మ్యాచ్ లో గొడవ
నిన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ వివాదం తాజాగా వెలుగులోకి వచ్చింది. ముంబై జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆ జట్టు కోచ్ మార్క్ బౌచర్, బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్, క్రికెటర్ టిమ్ డేవిడ్ నాలుగో అంపైర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ వివాదం ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముంబై ఇండియన్స్ జట్టు తమ బ్యాటింగ్ సమయంలో 15వ ఓవర్ తర్వాత సమయం కావాలని కోరింది, అయితే ఆ సమయంలో దానిని ఉపయోగించుకోవడానికి ఫోర్త్ అంపైర్ అనుమతించకపోవడం ఈ వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 


రోహిత్ సెంచరీ బాదినా.. చెన్నైదే గెలుపు..
ఆదివారం హోం గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (69), శివమ్‌ దూబే (66) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆఖరి ఓవర్ లో అయితే ధోని సిక్సర్ల సునామీ సృష్టించాడు. చివరి ఓవర్ లో హ్యాట్రిక్ సిక్సులు కొట్టిన మహి కేవలం 4 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. ఆనంతరం ఛేజింగ్ కు దిగిన ముంబై మతిసా పతిరనా (28 పరుగులకు 4 వికెట్లు) ధాటికి 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ 63 బంతుల్లో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. 



Also Read: IPL Live MI vs CSK Highlights: పతిరణ దెబ్బకు ముంబై ఇండియన్స్‌ విలవిల.. చెన్నై భారీ విజయం


Also Read: Ramandeep Catch Video viral: దీపక్ హుడా బిగ్ షాక్.. 'సూపర్‌మ్యాన్'లా గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్ పట్టిన రమణ్ దీప్, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter