MI vs CSK Highlights: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఫేవరేట్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మరో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై ఆధిపత్యం చలాయించింది. సొంత మైదానం వాంఖడే స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో సీఎస్కే చేతిలో ముంబై ఇండియన్స్ బోల్తా కొట్టింది. సీఎస్కే 20 పరుగుల తేడాతో ఎంఐపై విజయం సాధించింది. పతిరణ ముంబైని చావుదెబ్బ తీశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ దూకుడుగా ఆడింది. నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు తీసింది. అజింక్య రహనే (5), రచీన్ రవీంద్ర (21) కొద్దిసేపు ఆడి మైదానం వీడారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (69), శివమ్ దూబే (66) దూకుడైన ఆటతో భారీగా పరుగులు తీశారు. డేరిల్ మిచెల్ (17) అలా వచ్చి ఇలా వెళ్లిపోగా.. ఆఖరి ఓవర్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సిక్సర్లతో రెచ్చిపోయారు. హ్యాట్రిక్ సిక్స్‌లతోపాటు రెండు పరుగులు తీసి 4 బంతుల్లో 20 పరుగులు చేసి ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మొదట బ్యాటర్లపై అజమాయిషీ చెలాయించిన ముంబై బౌలర్లు తర్వాత చేతులెత్తేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా.. గెరాల్డ్ కాట్జీ, శ్రేయస్ గోపాల్ చెరొక వికెట్ పడగొట్టారు. గత మ్యాచ్‌లో ఐదు వికెట్లతో విజృంభించిన జస్ప్రీత్ బుమ్రా చెన్నైపై ప్రభావం చూపలేకపోయాడు.
Also Read: IPL Live Score 2024 LSG vs DC: ఢిల్లీకి భారీ ఊరట.. లక్నోను చిత్తు చేసి 'పంత్ సేన' కీలక విజయం
చెన్నై నిర్దేశించిన మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక ముంబై ఇండియన్స్ చతికిలపడింది. గత రెండు మ్యాచుల్లో దూకుడుతో ఆడిన ముంబై ఇండియన్స్ చెన్నై మ్యాచ్‌లో పరాభవం ఎదురైంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. రోహిత్ శర్మ వీర విహారం చేసినా కూడా మ్యాచ్‌ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు క్రీజులోనే ఉండి విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. కానీ ఫలితం మాత్రం చేదు మిగిల్చింది. 63 బంతుల్లో 105, 11 ఫోర్లు, 5 సిక్సర్లతో హిట్‌మ్యాన్ చెలరేగి ఆడాడు. ఇషాన్ కిషన్ (23), తిలక్ వర్మ (31) జట్టుకు విజయం దిశగా కొంత శ్రమించారు. సూర్య కుమార్ యాదవ్ మాత్రం డకౌట్‌తో నిరాశపర్చాడు.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా (2), టిమ్ డేవిడ్ (13), రొమారియో షెఫర్డ్ (1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. చెన్నైకి బౌలింగ్ బలం అనేది మరోసారి నిరూపితమైంది. మతీష పతిరణ తన బంతుల్లో ముంబైని భయపెట్టించాడు. కీలకమైన నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థిని ఓటమి బాట పట్టించాడు. ముస్తఫిజర్ రహమాన్, తుషార్ దేశ్‌పాండే ఒక్కో వికెట్ తీశారు.
రోహిత్, పతిరణ విజృంభణ
ఈ మ్యాచ్‌లో హైలెట్ విషయాలేమిటంటే రోహిత్ శర్మ, పతిరణ ప్రదర్శనలు చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత రోహిత్ శతకంలో ప్రేక్షకులు, తన అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చాడు. జట్టు విజయం కోసం శ్రమిస్తూనే తన వ్యక్తిగత ఖాతాలో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. బ్యాట్‌తో విజృంభించి టాప్ స్కోరర్‌గా నిలిచినా కూడా జట్టు విజయం బాట పట్టలేదు. ఇక బౌలింగ్‌లో పతిరణ విజృంభించాడు. కీలక సమయంలో బంతితో వచ్చిన పతిరణ ప్రత్యర్థితో విరుచుకుపడ్డాడు. పొదుపుగా పరుగులు ఇస్తూనే వికెట్లను పడగొట్టిన తీరు ఆహా అనిపించింది. ఈ మ్యాచ్ ప్రేక్షకులకు చక్కటి వినోదం అందించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter