IPL 2025 Mega Auction in Telugu: ఈసారి ఐపీఎల్ సరికొత్తగా ఉండబోతోంది. కొన్ని నిబంధనల మార్పుతో పాటు ఆటగాళ్ల మార్పిడి ఉంటుంది. అన్నింటి కంటే ముఖ్యంగా ఐదు జట్లు కొత్త కెప్టెన్‌తో రంగంలో దిగనున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ సహా మరో మూడు జట్లు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోల్‌కతా నైట్‌రైడర్స్


శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2024 టైటిల్ గెల్చుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో కీలకమైన మార్పు రానుంది. జట్టు యాజమాన్యం కెప్టెన్సీని మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్ కొత్త కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్‌ను పరిశీలిస్తోంది. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ఈ ఆఫర్ స్వీకరిస్తే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ పదవిని వదులుకోవల్సి ఉంటుంది. 


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా రానున్న ఐపీఎల్ సీజన్‌కు కొత్త కెప్టెన్ కోసం చూస్తోంది. ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలో ప్లే ఆఫ్ దశకు చేరినా కప్ సాధించలేకపోయింది. ఇక ఈసారి ఫాఫ్ డుప్లెసిస్‌ను రిలీజ్ చేయవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే కీలకమైన పరిణామమే కానుంది. 


సన్‌రైజర్స్ హైదరాబాద్


గత సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన ఈ జట్టు చివర్లో అంటే ఫైనల్‌లో తడబడటంతో టైటిల్ కోల్పోయింది. రన్నరప్‌గా నిలిచింది. రానున్న సీజన్‌కు అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ జోడీని విడగొట్టడం ఇష్టం లేదు. నిబంధనల ప్రకారం ఒక విదేశీ ఆటగాడినే రిటైన్ చేసుకోవల్సి ఉండటంతో పాట్ కమిన్స్‌ను వదులుకోవచ్చు. 


పంజాబ్ కింగ్స్ ఎలెవన్


ఇటీవల క్రికెట్ నుంచి రిటైర్మెండ్ ప్రకటించిన శిఖర్ ధావన్ ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. రానున్న సీజన్‌కు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కొత్త కెప్టెన్ ఎంచుకోవచ్చని తెలుస్తోంది. 


లక్నో సూపర్ జెయింట్స్


రానున్న ఐపీఎల్ సీజన్‌కు కొత్త కెప్టెన్ ఎంచుకోనున్న జట్లలో లక్నో సూపర్ జెయింట్స్ ఒకటి. ఈ జట్టు యాజమాన్యం కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా తొలగించవచ్చు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పేరు పరిశీలనలో ఉంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.


Also read: Rohith Sharma: ఇక ముంబైకి రోహిత్‌ శర్మ గుడ్‌బై? కోట్లతో వల వేసేందుకు ఫ్రాంచైజీలు రె'ఢీ'



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.