Mumbai Indians: భారత పురుషుల జట్టులో సీనియర్ ఆటగాడు.. విజయవంతమైన సారథి.. జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించిన రోహిత్ శర్మ వయసు మీద పడుతోంది. ప్రదర్శన నిలకడగా ఉన్న వయసు రీత్యా పరిస్థితులు గడ్డుగా మారుతున్నాయి. ఇప్పటికిప్పుడు భారత జట్టులో ఎలాంటి ఉపద్రవం లేకున్నా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం పరిస్థితి అతడికి వ్యతిరేకంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ కొనసాగాడు. ఫ్రాంచైజీకి ఐదు ట్రోఫీలు దక్కడంలో హిట్ మ్యాన్ పాత్ర కీలకం. అలాంటి స్టార్ ఆటగాడిని వదులుకునేందుకు ముంబై వదులుకునేందుకు సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా చెప్పాడు.
Also Read: Samit Dravid: క్రికెట్‌లో మరో వారసుడు.. అండర్ 19 జట్టులోకి దిగ్గజ ఆటగాడి కుమారుడికి చోటు
గత ఐపీఎల్ సీజన్‌లోనే ముంబై ఇండియన్స్‌లో రోహిత్ శర్మకు ఒక విధంగా అవమానం జరిగింది. అనూహ్యంగా పక్క ఫ్రాంచైజీ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకువచ్చి కెప్టెన్సీ ఇచ్చారు. రోహిత్‌ను సాధారణ ఆటగాడిగా ఫ్రాంచైజీ యాజమాన్యం చేసింది. ఇక మ్యాచ్‌ల్లో రోహిత్‌తో హార్దిక్ వ్యవహరించిన తీరు ప్రేక్షకుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. హిట్ మ్యాన్‌ను జూనియర్ శాసించడం ఏమిటని సర్వత్రా ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. అవన్నీ మనసులో పెట్టుకున్న హిట్ మ్యాన్ ముంబైను వీడేందుకు సిద్ధమయ్యాడు. ఇదే విషయాన్ని అప్పట్లోనే సూచనప్రాయంగా చెప్పాడు. ఇప్పుడు ఆకాశ్ చోప్రా కూడా అదే విషయాన్ని తెలిపాడు. 'రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడనున్నాడు. ఎంఐ హిట్‌మ్యాన్‌ను రిటైన్ చేసుకునే అవకాశం దాదాపు లేదు' అని కుండబద్దలు కొట్టి చెప్పాడు.
Also Read: Jay Shah: బిగ్ బ్రేకింగ్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ జై షా ఏకగ్రీవ ఎన్నిక
'ముంబై రోహిత్ శర్మను రిటైన్ చేసుకోదు. రోహిత్ కూడా ముంబైను వీడాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే మెగా వేలానికి రాకుండా మరో ఫ్రాంచైజీకి అతడిని ట్రేడ్ చేసే అవకాశం ఉంది. ముంబైతో ఇక రోహిత్ ప్రయాణం ముగిసిందనుకుంటున్నా' అని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలు వాస్తవంగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ సీజన్‌లో విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. దశాబ్దానికి పైగా ముంబైకి సేవలు అందించిన రోహిత్ శర్మను పొమ్మనలేక పొగబెడుతున్నారు. వీటన్నటికి రంగం సిద్ధం చేసుకున్న రోహిత్ జట్టును వీడడం ఖాయమే కనిపిస్తోంది.
అయితే ముంబై రిటైన్ చేసుకోకుంటే రోహిత్ శర్మ మెగా వేలానికి వచ్చే అవకాశం ఉంది. స్టార్ బ్యాటర్.. విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ను మెగా వేలానికి రాకముందే ఇతర ఫ్రాంచైజీలు వలలో వేసుకునే అవకాశం ఉంది. ముందే సంప్రదింపులు చేసుకుని రోహిత్‌తో భారీ డీల్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. రోహిత్‌ను ఎట్టి పరిస్థితుల్లో వేలానికి రాకుండా చూసుకునేందుకు అన్ని జట్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే లక్నో సూపర్ జియంట్స్ రోహిత్‌ను గాలం వేసేందుకు ఎంతకైనా సిద్ధమనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరగబోతున్నదనేది కొన్ని వారాల్లో తెలియనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter