IPL 2025 Mega Auction: ఆ ముగ్గురు ప్లేయర్లకు కావ్య పాప మాస్టర్ స్ట్రోక్.. వేలానికి ముందు పెద్ద ప్లానింగే బాబాయ్..!
Kavya Maran Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ మెగా వేలానికి సిద్ధమవుతోంది. టీమ్ ఓనర్ కావ్య మారన్ ప్లేయర్ల జాబితాపై కసరత్తు చేస్తున్నారు. ముగ్గురు కీలక ఆటగాళ్లను టీమ్ నుంచి రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Kavya Maran Sunrisers Hyderabad: ఐపీఎల్-2025 ముందు జరిగే మెగా వేలానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. టీమ్ నుంచి రిలీజ్ చేసే ప్లేయర్ల జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎవరిని టీమ్‌లో ఉంచుకోవాలి..? పర్స్‌లో ఎంత మిగులుతుంది..? వేలంలో ఏ ప్లేయర్లను దక్కించుకోవాలి..? ఎంత ఖర్చు చేయాలి..? వంటి లెక్కలు వేసుకుంటున్నాయి. ఇక ఈ సీజన్ ఐపీఎల్‌లో దుమ్ములేపే పర్ఫామెన్స్‌తో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. కప్ గెలవకపోయినా బ్యాటింగ్‌లో విధ్వంసంతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. రికార్డులు బ్రేక్ చేసే పర్ఫామెన్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించింది. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ ఓనర్ కావ్య మారన్ రిటైన్షన్ జాబితాపై భారీగానే కసరత్తు చేస్తున్నారు. ఐపీఎల్-2025లో టైటిల్ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.
రిటెన్షన్ పాలసీ గురించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఎంతమంది ఆటగాళ్లను టీమ్‌తో అట్టిపెట్టుకోవాలనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే గరిష్టంగా నలుగురు లేదా ఐదుగురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం కల్పించవచ్చు. ఈ లెక్కల ఆధారంగానే కావ్య మారన్ ప్లేయర్ల లిస్ట్‌ను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌కు ముందు జరిగిన మినీ వేలంలో రూ.20.25 కోట్లకు పాట్ కమిన్స్‌ను వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ దక్కించుకుంది. కమిన్స్‌ను రిటైన్ చేసుకుంటే అదే మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం పనిలేకపోయినా.. అంతకంటే తక్కువ ఇస్తామంటే అతను అంగీకరిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. లేదా కమిన్స్‌ను వేలంలోకి రిలీజ్ చేసి రైట్ టూ మ్యాచ్ కార్డ్ ద్వారా తిరిగి సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఆర్‌టీమ్ కార్డు రూల్స్‌పై స్పష్టత రావాల్సి ఉంది.
మాజీ కెప్టెన్ ఎడెన్ మార్క్‌రమ్‌ను టీమ్ నుంచి రిలీజ్ చేయాలని కావ్య మారన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ సారథ్య బాధ్యతలు చేపట్టిన మార్క్‌రమ్.. దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఈ సీజన్‌లో ఆటగాడిగానూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో మార్క్‌రమ్‌కు బై బై చెప్పాలని ఎస్‌ఆర్‌హెచ్ చూస్తోంది.
మరో సీనియర్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ విషయంలోనూ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. 2014 నుంచి టీమ్‌లో ఉన్న భూవీ.. జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. 2016లో టైటిల్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. 2016, 2017 సీజన్లలో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. అయితే గత కొన్ని సీజన్లుగా భూవీ బౌలింగ్‌లో వాడి తగ్గింది. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. దీంతో భూవీని వేలంలోకి పంపించాలని భావిస్తోంది. యువ ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్ కూడా అంచనాలను అందుకోలేకపోయాడు. బ్యాట్‌తోనూ, బంతితోనూ రాణించలేకపోవడంతో ఈ సీజన్‌లో తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. జాన్సన్‌ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.