IPL 2025 Mega Auction: ఐపీఎల్ వేలంలో చిత్రం, హైదరాబాదీ గుజరాత్‌కు..గుజరాతీ హైదరాబాద్‌కు
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఊహించినట్టే భారీ ధరలకు ఆటగాళ్లు వేలమౌతున్నారు. అంచనా వేసినట్టే స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటాపోటీగా వేలంపాట పాడుతున్నాయి. ఈ క్రమంలో గుజరాతీ ఆటగాడు హైదరాబాద్‌కు..హైదరాబాదీ గుజరాత్‌కు అమ్ముడుపోయారు.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగావేలం మొదటి రోజు ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడుపోతున్నారు. రిలీజ్ చేసిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు మళ్లీ పోటీ పడుతున్నాయి. శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ లెవెన్ భారీ ధర 26.75 కోట్లకు దక్కించుకోగా రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్లతో కొనుగోలు చేసి రికార్డ్ బ్రేక్ చేసింది.
ఐపీఎల్ 2025 మెగా వేలం వివిధ ఫ్రాంచైజీల మధ్య హోరాహోరీగా నడుస్తోంది. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, అర్షదీప్ సింగ్, రబడ, జోస్ బట్లర్, మిచెల్ స్టార్క్, మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, లివింగ్ స్టోన్‌లు భారీ ధరకు అమ్ముడయ్యారు. 2 కోట్ల బేస్ ప్రైస్ కలిగిన ఈ
ఆటగాళ్లంతా భారీ ధర దక్కించుకున్నారు. వీరిలో అర్షదీప్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు రైట్ టు మ్యాచ్ ద్వారా చేజిక్కించుకుంది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుజరాతీ ఆటగాడు, గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన టీమ్ ఇండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 10 కోట్లకు దక్కించుకుంది. ఇక హైదరాబాదీ ఆటగాడు, టీమ్ ఇండియా స్టార్ పేసర్, గత సీజన్ వరకూ ఆర్సీబీకు ఆడిన మొహమ్మద్ సిరాజ్‌ను 12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ జట్టు దక్కించుకుంది. రెండు జట్లు కూడబలుక్కున్నట్టుగా పరస్పరం మార్చుకున్నాయి. హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్‌ను గుజరాత్, గుజరాతీ మొహమ్మద్ షమీని హైదరాబాద్ వేలంలో దక్కించుకోవడం విశేషం.
Also read: IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగావేలంలో రికార్డ్ ధర, 26.75 కోట్లు పలికిన శ్రేయస్ అయ్యర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.