IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలం 2025లో ఊహించినట్టే పోటాపోటీ వేలం జరుగుతోంది. వేలం ప్రారంభం కాగానే మొట్టమొదటి ప్లేయర్ అర్షదీప్ సింగ్‌ను భారీ ధరకు పంజాబ్ కింగ్స్ లెవెన్ మరోసారి చేజిక్కించుకుంది. వాస్తవానికి ఎస్ఆర్‌హెచ్‌కు దక్కాల్సి ఉన్నా..రైట్ టు మ్యాచ్ ప్రకారం పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఇక ఐపీఎల్ గత సీజన్ విన్నర్ కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్ని రికార్డుల్ని తిరగరాశారు.
ఐపీఎల్ 2025 మొదటి రోజు వేలం ప్రారంభంలోనే భారీ ధరలు పలుకుతున్నాయి. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో ప్రారంభమైన అర్షదీప్ సింగ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య పోటీ జరుగుతుండగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 15.75 కోట్ల వరకూ వెళ్లింది. దక్కించుకునే క్రమంలో పంజాబ్ కింగ్స్ రైట్ టు మ్యాచ్ ఉపయోగించి 18 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక ఆ తరువాత అందరూ ఊహించినట్టే శ్రేయస్ అయ్యర్ బరిలో దిగారు. తొలుత శ్రేయస్ అయ్యర్ కోసం కేకేఆర్ ప్రయత్నించి 4 కోట్ల వరకూ వేలం పాడింది. కానీ ఆ తరువాత శ్రేయస్ అయ్యర్ కోసం రెండు జట్లు విపరీతంగా పోటీ పడ్డాయి.
శ్రేయస్ అయ్యర్ కోసం ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఎందుకంటే రెండు జట్లు తమ కెప్టెన్లను రిలీజ్ చేసేశాయి. ఇప్పుడీ జట్లకు మంచి సమర్ధవంతమైన కెప్టెన్ అవసరముంది. గత సీజన్‌లో కేకేఆర్‌కు టైటిల్ తెచ్చిపెట్టడంలో శ్రేయస్ అయ్యర్ కీలకభూమిక పోషించాడు. అందుకే శ్రేయస్ అయ్యర్ కోసం రెండు జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆఖరికి పంజాబ్ కింగ్స్ లెవెన్ 26.75 కోట్లకు శ్రేయస్ అయ్యర్‌ను దక్కించుకుంది.
Also read: IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలంలో జాక్‌పాట్ ఎవరికి, అందరి దృష్టి ఆ ఆటగాళ్లపైనే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.