IPL Auction: పంత్, శ్రేయస్, వెంకటేశ్‌తో సహా ఆటగాళ్ల వేలం ధరల పూర్తి జాబితా ఇదే!
IPL 2025 Mega Auction Players Full Price List Here: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు ముగిసింది. కళ్లు చెదిరేలా ఆటగాళ్ల ధరలు పలుకగా.. పంత్, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్‌తోపాటు ఆటగాళ్ల పూర్తి ధరలు ఇలా ఉన్నాయి.
IPL Mega Auction 2025 Highlights: క్రికెట్ అభిమానులు అత్యంత ఉత్కంఠగా ఎదురుచూసిన మెగావేలంలో మొదటి రోజు పూర్తయ్యింది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం జెడ్డాలో ఆదివారం నిర్వహించిన మెగా వేలానికి ఊహించని స్పందన లభించింది. కళ్లు చెదిరే రీతిలో వేలం ధరలు పలికాయి. మొత్తం 577 మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా.. 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు పోటీపడ్డాయి. వేలంలో ఆటగాళ్ల ధరలు ఇలా ఉన్నాయి.
ఇది చదవండి: Rishabh Pant: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర.. రిషబ్ పంత్‌కు కోట్లాభిషేకం
చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కళ్లు చెదిరే ధరలు పలికాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు రిషబ్ పంత్ రూ.27 కోట్లకు అమ్ముడుపోగా.. శ్రేయస్ అయ్యర్ రూ.25 లక్షలు తక్కువగా రూ.26.75 కోట్లు పలికాడు. వెంకటేశ్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చాహల్, మహ్మద్ షమీ వంటి స్టార్ ప్లేయర్లు వేలంలో భారీ ధర పలికారు. పంజాబ్ కింగ్స్ విచ్చలవిడిగా ఖర్చు చేయగా.. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ అత్యంత పొదుపుగా ఖర్చు చేయగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా తక్కువ ఖర్చు చేసింది. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఆసక్తికరంగా పోటీపడగా.. ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం ఆచితూచి వేలంలో పాల్గొన్నది.
ఇది చదవండి: Kavya Maran: ఐపీఎల్ వేలంలో కావ్య మారన్‌కు భారీ షాక్.. శాపంగా మారిన ఆర్‌టీఎం కార్డు
ఆటగాళ్లు ఇలా..
ఐపీఎల్ మెగా వేలంలో మొత్తం 1,574 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో వెయ్యి మంది పేర్లను తొలగించి 574 మంది ఆటగాళ్ల పేర్లతో జాబితా విడుదల చేశారు. వేలానికి వచ్చిన ఆటగాళ్లలో భారత ప్లేయర్లు మొత్తం 366 మంది ఉండగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. రేపు సోమవారం కూడా వేలం కొనసాగనుంది. దిగ్గజ ఆటగాళ్ల వేలం తొలి రోజే పూర్తవడంతో రెండో రోజు పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు.
వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..
అర్ష్‌దీప్ సింగ్ - పంజాబ్ కింగ్స్
కనీస ధర రూ.2 కోట్లు.. వేలం ధర రూ.18 కోట్లు
కగిసో రబడా - గుజరాత్ టైటాన్స్
కనీస ధర రూ.2 కోట్లు.. వేలం ధర రూ.10.75 కోట్లు
శ్రేయస్ అయ్యర్ - పంజాబ్ కింగ్స్
కనీస ధర రూ.2 కోట్లు.. వేలం ధర రూ.26.75 కోట్లు (ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక ధర)
జాస్ బట్లర్ - గుజరాత్ టైటాన్స్
కనీస ధర రూ.2 కోట్లు.. వేలం ధర రూ.15.75 కోట్లు
మిచెల్ స్టార్క్ - ఢిల్లీ క్యాపిటల్స్
కనీస ధర రూ.2 కోట్లు.. వేలం ధర రూ.11.75
రిషబ్ పంత్ - లక్నో సూపర్ జెయింట్స్
కనీస ధర రూ.2 కోట్లు.. వేలం ధర రూ.27 కోట్లు (ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర)
మహ్మద్ షమీ సన్‌రైజర్స్ హైదరాబాద్
కనీస ధర రూ.2 కోట్లు.. వేలం ధర రూ.10 కోట్లు
డేవిడ్ మిల్లర్ - లక్నో సూపర్ జెయింట్స్
కనీస ధర రూ.1.50 కోట్లు.. వేలం ధర రూ.7.50 కోట్లు
యజువేంద్ర చాహల్ - పంజాబ్ కింగ్స్
కనీస ధర రూ.2 కోట్లు.. వేలం ధర రూ.18 కోట్లు
మహ్మద్ సిరాజ్ -గుజరాత్ టైటాన్స్
కనీస ధర రూ.2 కోట్లు.. వేలం ధర రూ.12.25 కోట్లు
లియామ్ లివింగ్‌స్టన్ -రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కనీస ధర రూ.2 కోట్లు.. వేలం ధర రూ.8.75 కోట్లు
కేఎల్ రాహుల్ -ఢిల్లీ క్యాపిటల్స్
కనీస ధర రూ.2 కోట్లు.. వేలం ధర రూ.14 కోట్లు
హ్యారీ బ్రూక్ -ఢిల్లీ క్యాపిటల్స్
కనీస ధర రూ.2 కోట్లు వేలం ధర రూ.6.25 కోట్లు
ఎడెన్ మార్‌క్రమ్ -చెన్నై సూపర్ కింగ్స్
కనీస ధర రూ.2 కోట్లు మాత్రమే పలికాడు
డేవాన్ కాన్వే -చెన్నై సూపర్ కింగ్స్
కనీస ధర రూ.2 కోట్లు వేలం ధర రూ.6.25 కోట్లు
రాహుల్ త్రిపాఠి -చెన్నై సూపర్ కింగ్స్
రూ.75 లక్షలు వేలం ధర రూ.3.40 కోట్లు
జేక్ ఫ్రేజర్ - పంజాబ్ కింగ్స్
కనీస ధర రూ.2 కోట్లు వేలం ధర రూ.9 కోట్లు
హర్షల్ పటేల్ -సన్‌రైజర్స్ హైదరాబాద్
కనీస ధర రూ.2 కోట్లు వేలం ధర రూ.8 కోట్లు
రచిన్ రవీంద్ర -చెన్నై సూపర్ కింగ్స్
కనీస ధర రూ.1.50 లక్షలు వేలం ధర రూ.4 కోట్లు
రవిచంద్రన్ అశ్విన్ -చెన్నై సూపర్ కింగ్స్
కనీస ధర రూ.2 కోట్లు వేలం ధర రూ.9.75 కోట్లు
వెంకటేశ్ అయ్యర్ -కోల్‌కత్తా నైట్‌రైడర్స్
కనీస ధర రూ.2 కోట్లు వేలం ధర రూ.23.75 కోట్లు
మార్కస్ స్టొయినీస్ -పంజాబ్ కింగ్స్
కనీస ధర రూ.2 కోట్లు వేలం ధర రూ.11 కోట్లు
మిచెల్ మార్ష్ -లక్నో సూపర్ జెయింట్స్
కనీస ధర రూ.2 కోట్లు వేలం ధర రూ.3.40 కోట్లు
గ్లెన్ మ్యాక్స్‌వెల్స్ -పంజాబ్ కింగ్స్
కనీస ధర రూ.2 కోట్లు వేలం ధర రూ.4.20 కోట్లు
క్వింటాన్ డికాక్ -కోల్‌కత్తా నైట్‌రైడర్స్
కనీస ధర రూ.2 కోట్లు వేలం ధర రూ.3.60 కోట్లు
ఫిల్ సాల్ట్ -రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
కనీస ధర రూ.2 కోట్లు వేలం ధర రూ.11.50 కోట్లు
రహ్మనుల్లా గుర్బాజ్ - కోల్‌కత్తా నైట్‌రైడర్స్
కనీస ధర రూ.2 కోట్లకే అమ్ముడుపోయాడు
ఇషాన్ కిషన్ - పంజాబ్ కింగ్స్
కనీస ధర రూ.2 కోట్లు.. వేలం ధర రూ.11.25 కోట్లు
జితేశ్ శర్మ -రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
కనీస ధర రూ.కోటి.. వేలం ధర రూ.11 కోట్లు
జోష్ హేజిల్‌వుడ్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కనీస ధర రూ.2 కోట్లు.. వేలం ధర రూ.12.50 కోట్లు
ప్రసిద్ద్ కృష్ణ - గుజరాత్ టైటాన్స్
కనీస ధర రూ.2 కోట్లు.. వేలం ధర రూ.9.50 కోట్లు
అవేశ్ ఖాన్ - లక్నో సూపర్ జెయింట్స్
కనీస ధర రూ.2 కోట్లు.. వేలం ధర రూ.9.75 కోట్లు
హన్రిచ్ నోకియా - కోల్‌కత్తా నైట్‌రైడర్స్
కనీస ధర రూ.2 కోట్లు.. వేలం ధర రూ.6.50 కోట్లు
జోఫ్రా అర్చర్ - రాజస్థాన్ రాయల్స్
కనీస ధర రూ.2 కోట్లు.. వేలం ధర రూ.12.50 కోట్లు
ఖలీల్ అహ్మద్ - చెన్నై సూపర్ కింగ్స్
వేలం ధర రూ.4.80 కోట్లు
నటరాజన్ - ఢిల్లీ క్యాపిటల్స్
కనీస ధర రూ.2 కోట్లు వేలం ధర రూ.10.75 కోట్లు
ట్రెంట్ బౌల్ట్ - ముంబై ఇండియన్స్
కనీస ధర రూ.2 కోట్లు వేలం ధర రూ.12.50 కోట్లు
మహీష్ తీక్షణ - రాజస్థాన్ రాయల్స్
కనీస ధర రూ.2 కోట్లు వేలం ధర రూ.4.40 కోట్లు
రాహుల్ చాహర్ - సన్‌రైజర్స్ హైదరాబాద్
వేలం ధర రూ.3.20 కోట్లు
ఆడమ్ జంపా - సన్‌రైజర్స్ హైదరాబాద్
వేలం ధర రూ.2.40 కోట్లు
వణిందు హసరంగ - రాజస్థాన్ రాయల్స్
వేలం ధర రూ.5.25 కోట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.