Arjun Tendulkars First Reaction After Joining Mumbai Indians: చెన్నై వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021) వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఒకడు. ఒప్పడు ముంబై ఇండియన్స్ జట్టుకు బాల్ బాయ్‌గా పనిచేసిన అర్జున్ నేడు ఏకంగా ఆ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరి 18న చెన్నై నిర్వహించిన ఐపీఎల్ 2021 వేలం (IPL 2021 Auction)లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ లెఫ్టార్మ్ పేసర్, ఆల్ రౌండర్ అయిన అర్జున్ టెండూల్కర్‌ను కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో ధర విషయంలో అంచనాలు తప్పాయి కానీ అంతా అనుకున్నట్లుగానే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అర్జున్‌ను తీసుకుంది.


Also Read: IPL 2021 Auction Latest Updates: ఐపీఎల్ 2021 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే



తొలిసారిగా ఐపీఎల్ ఆడబోతున్న అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) తనను నిరూపించుకునేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. చిన్ననాటి నుంచి తాను ముంబై ఇండియన్స్‌కు వీరాభిమాని అన్నాడు. ముంబై జట్టుకు ఆడబోతుండటంతో మరింత ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు. తనకు సహకరించిన, మద్దతు తెలిపిన ముంబై ఇండియన్స్ కోచ్, సహాయక సిబ్బందికి వీడియో ద్వారా ధన్యవాదాలు తెలిపాడు.


Also Read: Glenn Maxwell పంట పండింది, రూ.14.25 కోట్లకు అమ్ముడైన లక్కీ ప్లేయర్


వేలంలో అర్జున్ టెండూల్కర్‌ను తీసుకున్న అనంతరం ముంబై ఇండియన్స్ ఇలా ట్వీట్ చేసింది. ‘గతంలో వాంఖేడేలో బాల్ బాయ్‌గా చేశావు. సపోర్ట్ బౌలర్‌గా సేవలు అందించావు. ఇప్పడు తొలి ఆటగాడు అయ్యావు. అర్జున్ షో టైమ్’ అని ముంబై ఇండియన్స్ ట్వీట్ చేసింది. 


Also Read: IPL 2021 Auction: ఐపీఎల్ 2021లో Sunrisers Hyderabad మొత్తం ఆటగాళ్ల జాబితా ఇదే 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook