IPL 2021 Auction Costliest Player: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021 Auction) మినీ వేలంలో కొందరు ఆటగాళ్లు లక్కీగా మారగా, మరికొందరు కనీస ధరకు కూడా కొనుగోలు కాలేదు. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పంట పండింది. మినీ వేలంలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు.
గత సీజన్‌లో ఏ మాత్రం ప్రదర్శన ఇవ్వకపోవడం పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ మ్యాక్స్‌వెల్‌ను వదులకుంది. కానీ తాజాగా జరిగిన ఐపీఎల్ 2021 వేలంలో ఊహించని మొత్తంలో రూ.14.25 కోట్లకు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను తీసుకున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఎక్కువ మొత్తం వెచ్చించి మ్యాక్స్‌వెల్‌ను తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీపడి ఆర్సీబీ(RCB)నే దక్కించుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌ను మరింత పటిష్టం చేసుకుంది.
Also Read: IPL 2021 Auction: ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం ఆటగాళ్ల జాబితా ఇదే
మరోవైపు టీమిండియా క్రికెటర్ కేదార్ జాదవ్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. రాజస్థాన్ రాయల్స్ వదులుకున్న స్టీవ్ స్మిత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ 2.2 కోట్లకు తీసుకుంది. హనుమ విహారిని సైతం ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. మినీ వేలం కావడంతో పలువురు స్టార్ క్రికెటర్లు సైతం తమకు అవకాశం రాకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
Also Read: Du Plessis Retirement: రెండు కోరికలు తీరకుండానే రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ Faf Du Plessis
ఈ ఐపీఎల్ 2021 మినీ వేలంలో అమ్ముడుపోని తొలి క్రికెటర్‌గా కరుణ్ నాయర్ నిలిచాడు. ఆపై అలెక్స్ హేల్స్, ఎవిన్ లూయిస్, ఆరోన్ ఫించ్ లాంటి ఆటగాళ్లు Unsold జాబితాలో చేరిపోగా, బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను రూ.3.2 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ తీసుకుంది.
Also Read: SBI Personal Loan: ఒక్క ఎస్ఎంఎస్ లేదా Missed Call ద్వారా ఎస్‌బీఐ పర్సనల్ లోన్ పొందవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook