Liam Livingstone sold to Punjab Kings for Rs 11.50 crore: బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలంలో విదేశీ ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. తొలిరోజు పాట్ కమిన్స్, కాగిసో రబాడ, ట్రెంట్ బౌల్ట్, ఫఫ్ డుప్లెసిస్, క్వింటన్ డికాక్, జాసన్ హోల్డర్, వానిండు హాసరంగా, నికోలస్ పూరన్ లాంటి ఆటగాళ్లకు భారీ ధర పలికింది. రెండో రోజు కూడా విదేశీ ఆటగాళ్ల హవా నడుస్తోంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ లియామ్ లివింగ్‌స్టోన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండో రోజు మెగా వేలంలో లియామ్ లివింగ్‌స్టోన్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 11.50 కోట్లకు కొనుగోలు చేసింది. కనీస ధర రూ. కోటితో వేలం బరిలోకి దిగిన లివింగ్‌స్టోన్‌ కోసం చాలా ప్రాంఛైజీలు పోటీ పడినా.. చివరికి పంజాబ్ దక్కించుకుంది. లివింగ్‌స్టోన్ కోసం కోల్‌కతా ఓపెనింగ్ బిడ్ వేసింది. చెన్నై కూడా ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌పై ఆసక్తి చూపింది. చెన్నై వెనక్కి తగ్గక పంజాబ్ పోటీలోకి వచ్చింది. దాంతో అతడి వేలం 5 కోట్లకు చేరుకుంది. పంజాబ్, కోల్‌కతా మధ్య గట్టి పోటీ నెలకొనగా.. కింగ్స్‌కు పోటీగా గుజరాత్ బరిలోకి దిగింది. ఆపై సన్‌రైజర్స్ కూడా లివింగ్‌స్టోన్‌పై ఆసక్తి చూపింది. చివరి వరకు కింగ్స్‌ తగ్గలేదు. 



ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున లియామ్ లివింగ్‌స్టోన్‌ ఆడాడు. లివింగ్‌స్టోన్ తన కెరీర్‌లో 9 ఐపీఎల్ గేమ్‌లు ఆడాడు 14.0 సగటు మరియు 125.8 స్ట్రైక్ రేట్‌తో కేవలం 112 పరుగులు చేశాడు. అయితే ది హండ్రెడ్, ఇంగ్లండ్ తరపున ఈ పవర్ హిట్టర్ పరుగుల వరద పారించాడు. అందుకే ఐపీఎల్ 2022లో తన కాశీన ధరను ఒక కోటిగా నిర్ణయించాడు. అయితే అతడి కోసం చాలా ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి. అందుకే మనోడు భారీ ధర పలికాడు. 


Also Raed: Aiden Markram SRH: రెండో రోజు 'తగ్గేదే లే' అన్న కావ్య పాప.. తొలి ఆటగాడినే పట్టేసిన సన్‌రైజర్స్!!


Also Read: SRH Squad: కొందరినే తీసుకున్నా.. కావ్య పాప మంచి ఆటగాళ్లనే పట్టింది! సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఇదే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook