IPL Team eye on T20 World Cup 2022 Stars in IPL 2023 auction: ఐపీఎల్ 2023కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ నవంబర్ 16న పూర్తయింది. బీసీసీఐ విధించిన గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియడంతో 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించాయి. ఐపీఎల్ 2022లో సరిగా ఆడని స్టార్ ఆటగాళ్లను కూడా తప్పించేందుకు ఆయా ప్రాంఛైజీలు వెనకాడలేదు. కీరన్ పొలార్డ్‌, కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్‌లపై కూడా ప్రాంఛైజీలు వేటు వేశాయి. ఇక ఐపీఎల్ 2023కి సంబంధించిన వేలం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్‌ 2022లో సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న పలువురు ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. డిసెంబర్‌ 23న జరిగే ఐపీఎల్‌ 2023 మినీ వేలంలో ఫామ్ ఆటగాళ్ల కొనుగోలు చేయడం కోసం ఎంత డబ్బునైనా వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయట. ఇంగ్లండ్ పొట్టి టోర్నీ గెలవడంతో కీలక పాత్ర పోషించిన బెన్‌ స్టోక్స్‌, సామ్‌ కరన్‌లపై పలు ఫ్రాంచైజీలు కన్నేశాయి. స్టోక్స్‌ కనీసం 12 కోట్లు, కరన్‌ 10 కోట్లు పలికే అవకాశం ఉందట. 


ఆస్ట్రేలియా ప్లేయర్ కెమరూన్‌ గ్రీన్‌, జింబాబ్వే ఆటగాడు సికందర్‌ రజాలకు భారీ డిమాండ్ ఉంది. అలానే జాషువ లిటిల్‌ (ఐర్లాండ్‌), రిలీ రొస్సో (దక్షిణాఫ్రికా), అలెక్స్‌ హేల్స్‌ (ఇంగ్లండ్‌)లపై కూడా కాసుల వర్షం కురవనుంది. వీరికి 5 నుంచి 7 కోట్లు పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. లిటన్‌ దాస్‌, జేసన్‌ రాయ్‌, హ్యారీ బ్రూక్‌, ఎవిన్‌ లూయిస్‌, జేసన్‌ హోల్డర్‌, ఆదిల్‌ రషీద్‌, ఫిలిప్‌ సాల్ట్‌, కేశవ్‌ మహారాజ్‌లపై 2 కోట్లు వెచ్చించే ఛాన్స్‌ ఉంది. 


కోట్లు కొల్లగొట్టే టాప్ 5 ఆటగాళ్లు వీరే:
బెన్‌ స్టోక్స్‌
సామ్‌ కరన్‌
కెమరూన్‌ గ్రీన్‌
సికందర్‌ రజా
జాషువ లిటిల్‌
రిలీ రొస్సో


Also Read: Eshanya Maheshwari Pics: హాట్ ఫోటోస్‌తో హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్న ఇశన్య.. అందాల అరాచకం మాములుగా లేదుగా!  


Also Read: IPL 2023: జడేజాను రిటైన్ చేసుకున్న సీఎస్‌కే.. ఎంఎస్ ధోనీకి వంగి నమస్కారం చేసిన జడ్డు! ట్వీట్ వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook