MS Dhoni Field Set Up Traps Pollard: కెప్టెన్‌గా ధోనీ ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే. ధోనీ ఫీల్డింగ్ సెట్టింగ్, బౌలర్లకు అతనిచ్చే సలహాలు క్రీజులో ఉన్న బ్యాట్స్‌మ్యాన్‌ను ఇట్టే బోల్తా కొట్టిస్తాయి. ఇలాంటి సందర్భాలు గతంలో ఎన్నో మ్యాచ్‌ల్లో చూసి ఉంటాం. ప్రస్తుతం ధోనీ మాజీ కెప్టెనే అయినప్పటికీ... అప్పుడప్పుడు అతనిలోని కెప్టెన్ బయటకొస్తుంటాడు. తాజా ఐపీఎల్ సీజన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్ 21) ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ధోనీలోని కెప్టెన్ మరోసారి బయటకొచ్చాడు. అద్భుతమైన ఫీల్డింగ్ సెట్టింగ్‌తో ముంబై బ్యాట్స్‌మ్యాన్‌ కీరన్ పొలార్డ్‌ను ట్రాప్ చేసేశాడు ధోనీ. దీంతో ధోనీ నాయకత్వ లక్షణాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబై 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో కీరన్ పొలార్డ్ క్రీజులోకి వచ్చాడు. ఓ ఎండ్‌లో తిలక్ వర్మ కుదురుగా ఆడుతుంటే కీరన్ పొలార్డ్ హిట్టింగ్‌ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పటికే ఓ సిక్స్ కూడా బాదేశాడు. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్న పొలార్డ్‌ను ధోనీ తన అద్భుతమైన ఫీల్డింగ్ సెట్టింగ్‌తో పెవిలియన్‌కు పంపించాడు.


17 ఓవర్‌లో మహేష్ తీక్షణ బౌలింగ్‌కి రాగా... క్రీజులో కీరన్ పొలార్డ్ ఉన్నాడు. స్పిన్ బౌలింగ్‌లో పొలార్డ్ ఎటాకింగ్‌గా ఆడుతాడని ధోనీకి తెలుసు. ఆ సమయంలో ధోనీ వికెట్ల వెనుక నుంచి ఫీల్డింగ్‌లో కొన్ని మార్పులు చేశాడు. లాంగ్ ఆన్‌లో ఉన్న ఫీల్డర్ దూబేని బౌండరీ వద్దకు పంపించాడు. వికెట్లకు కాస్త స్ట్రైయిట్‌గా అతని ఫీల్డింగ్‌ని సెట్ చేశాడు. అంతే... ఆ తర్వాతి బంతికే కీరన్ పొలార్డ్ బంతిని గాల్లోకి లేపాడు. అది సరిగ్గా లాంగ్ ఆన్‌లో బౌండరీ వద్ద ఉన్న దూబే చేతుల్లోకి వెళ్లింది. దీంతో ధోనీ మ్యాజిక్ వర్కౌట్ అయినట్లయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోనీ షార్ప్ బ్రెయిన్‌కి కామేంటేటర్స్ సైతం ఫిదా అయ్యారు. అటు నెటిజన్లు సోషల్ మీడియాలో ధోనీని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.


ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే... ముంబై చెన్నై చేతిలో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఓడినట్లయింది. చెన్నై ఈ విజయంతో ఇప్పటివరకూ 2 మ్యాచ్‌ల్లో గెలిచినట్లయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై చివరి బంతికి విజయాన్ని అందుకుంది. ఉనద్కత్ బౌలింగ్‌లో చివరి బంతికి ధోనీ ఫోర్ బాదడంతో చెన్నై విజయం సాధించింది. 




Also Read: Horoscope Today April 22 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారిని తెలియని భయం కలవరపెడుతుంది


Also Read: MI vs CSK: చివరి ఓవర్లో గర్జించిన ధోనీ.. చెన్నై అద్భుత విజయం! వరుసగా ఏడో మ్యాచ్ ఓడిన ముంబై


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.