Horoscope Today April 22 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారిని తెలియని భయం కలవరపెడుతుంది

Horoscope Today  April 22 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారు సాధారణ రోజుల్లో కన్నా తమ వ్యాపారంలో కొంత ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత కలవరపెడుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2022, 08:57 AM IST
  • నేటి రాశి ఫలాలు
  • ఏయే రాశుల వారికి ఇవాళ ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే
  • పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today April 22 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారిని తెలియని భయం కలవరపెడుతుంది

Horoscope Today April 22 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... శుక్రవారం కొన్ని రాశుల వారికి అన్ని విధాలా కలిసొస్తుంది. ఏ రాశి వారైనా సరే... శుక్రవారం నాడు బద్దకాన్ని, సోమరితనాన్ని వీడాలి. లేదంటే కష్టాలు తప్పవు.  కొన్ని రాశుల వారు ఉద్యోగ విషయంలో ఒత్తిడి ఎదుర్కోక తప్పదు. అయితే ఓపికతో ముందుకెళ్తే అన్నీ సర్దుకుంటాయి. ఇవాళ ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి

మేషరాశి ( Aries) 

శుక్రవారం సాధారణం కంటే ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆఫీస్ పనులు శ్రద్ధగా చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఆఫీస్ మీటింగ్‌ను మీరు లీడ్ చేసే అవకాశం రావొచ్చు, కాబట్టి అందుకు సిద్ధంగా ఉండండి. ఆహార, పానీయాల వ్యాపారం చేసే వ్యాపారులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్దమొత్తంలో ఆర్డర్స్ వస్తాయి. అనవసర ఆందోళన మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ శుక్రవారం కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. యువత ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనవచ్చు.

వృషభ రాశి (Taurus)

ఈ శుక్రవారం మీ మనస్సు ఏదో తెలియని భయంతో కలవరపడుతుంది. మనస్సు మీపై ఆధిపత్యం చెలాయించవద్దు. పోటీని ఎదుర్కొని గెలవడానికి సిద్ధపడండి కానీ సహోద్యోగులను చూసి అసూయపడకండి, అది సరైంది కాదు. వ్యాపారంలో సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోండి. మీరు ఏదైనా కోర్సు చేయాలనుకుంటే.. ముందుగా పూర్తి వివరాలు తెలుసుకోండి. శరీరంలో గ్యాస్ సంబంధిత సమస్యలు ఉండవచ్చు. దాని కారణంగా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆమె ఉన్న రంగంలో విశేషంగా రాణించే అవకాశం ఉంది. స్త్రీలతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటే మానుకోండి. అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు.

మిథున రాశి (GEMINI)

శుక్రవారం నాడు ఇంట్లోని వ్యక్తులతో సున్నితంగా మెలగాలి. ఎంతటి కోపాన్నైనా అదుపులో పెట్టుకోండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు మీ బాస్‌తో సానుకూల వాతావరణాన్ని ఏర్పరుచుకోండి. చేపట్టిన కొన్ని పనులు అంతగా ముందుకు సాగకపోవచ్చు. అవి పూర్తయ్యేందుకు కొంత ఓపిక పట్టండి. వ్యాపార రంగంలో ఉన్నవారు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. క్రమం తప్పకుండా మందులు తీసుకోండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. 

కర్కాటక రాశి (Cancer) 

మీ ప్రతిభను మరింత సానబెట్టండి. యువత సాంకేతికతను ఉపయోగించుకోవాలి కానీ దుర్వినియోగం చేయకూడదు. మీరు ఎక్కడ పని చేసినా.. అక్కడ మీ జ్ఞానాన్ని పెంచుకోండి. తద్వారా మీరు విజయం సాధిస్తారు. వ్యాపార విషయంలో అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ ఉండేలా చూసుకోండి. మీరు చెల్లించాల్సిన డబ్బులను పెండింగ్‌లో ఉంచవద్దు. యూరిన్ ఇన్ఫెక్షన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ఈ వ్యాధితో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా వ్యవహరించండి.

సింహ రాశి (LEO)

శుక్రవారం మానసిక దిగ్భ్రాంతి కలిగించే రోజు. అయితే దీని గురించి ఆందోళన వద్దు. ప్రశాంతంగా ఆలోచించండి. ఉపాధ్యాయ వర్గానికి శుభ ఫలితాలు ఉంటాయి. మంచి ఫలితాలను ఆశించే పని చేయండి. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు ఏ పని చేసినా లాభపడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇంట్లో ధార్మిక కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా వైవాహిక జీవితంలో ప్రశాంతతను కోల్పోవద్దు. యువత మితిమీరిన ఆందోళనకు దూరంగా ఉండాలి. 

కన్య రాశి (Virgo)

కన్యరాశి వ్యక్తుల మనస్సు చాలా వేగంగా స్పందిస్తుంది. ఆలోచనల్లో సృజనాత్మకత ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు మీ బాస్‌తో వాదించాల్సిన అవసరం లేదు. మర్యాదగా మీ పాయింట్ చెప్పండి. టోకు వ్యాపారం చేసే వ్యాపారులు మంచి లాభాలను ఆర్జించగలుగుతారు. మీకు చెవి నొప్పి వచ్చే అవకాశం ఉంది. సమస్య ఎక్కువగా ఉంటే, అప్పుడు వైద్యుడిని సంప్రదించండి. ఇంటికి సంబంధించిన ఏదైనా ఉపయోగకరమైన వస్తువు కొనాల్సిన పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాల్సిన సమయం ఇది, మీరు మీ నెట్‌వర్క్‌ని పెంచుకోవాలి.

తులా రాశి (Libra)

మీ ప్రసంగం చాలా బాగుంటుంది. అది ఇతరులపై ప్రభావం చూపుతుంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే వారికి కొత్త ప్రాజెక్ట్ లభిస్తుంది. వాణిజ్య పరంగా చూస్తే ధాన్యం వ్యాపారులకు లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న వ్యాధులు కూడా నయమవుతాయి. తండ్రికి కోపం తెప్పించడం, అతని అసంతృప్తికి గురిచేయడం సరికాదు. మానసిక ప్రశాంతత కోసం భక్తి, ఆధ్యాత్మికత వైపు మళ్లుతారు.

వృశ్చిక రాశి (Scorpio)

మిమ్మల్ని మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా పెద్ద లాభం చూపి మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీరు కొత్త పనిని చేపట్టినట్లయితే, ఆనందంతో చేయండి, పని సులభం అవుతుంది. మీరు టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారైతే మంచి లాభాలను పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉదయాన్నే లేచి యోగా చేయండి. అమ్మకు సేవ చేయడం చాలా భాగ్యం. మీకు ఈ అవకాశం లభిస్తే వదిలిపెట్టకండి. 

ధనుస్సు రాశి (Sagittarius)  

కృషితో గుర్తింపు పొందుతారు. ఉద్యోగంలో ఒత్తిడిని ఎదుర్కొనేవారు కాస్త ఓపికతో ఉండాలి. క్రమంగా పరిస్థితులు మెరుగుపడతాయి. పెద్ద వ్యాపారులు ఈ సమయంలో పెట్టుబడికి దూరంగా ఉండాలి. లేనిపక్షంలో నష్టాలు తప్పకపోవచ్చు. ఎక్కువ నీరు తీసుకోవడంతో పాటు తేలికపాటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంతో కొంత సమయం గడుపుతారు, అందరూ సంతోషంగా ఉంటారు. యువతకు ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు.

మకర రాశి (Capricorn) 

ముఖ్య విషయాల్లో తొందరపాటు పనిచేయదు. ఆలోచనాత్మకంగా పని చేయండి. విదేశాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బట్టల వ్యాపారం చేసే వారు కొత్త స్టాక్ కోసం అడుగుతూనే ఉండాలి. కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంది. జీర్ణమయ్యే మరియు పోషకమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. గురువు లాంటి వ్యక్తి సాంగత్యం మీకు లభిస్తుంది. వారి అర్హతలు, అనుభవాన్ని సద్వినియోగం చేసుకోండి.

కుంభ రాశి (Aquarius)

ఈ రాశి వారి కష్టాలకు కారణం అనవసరంగా ఆందోళన చెందడమే. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే వారికి పూర్తి సానుకూల సమయం. వ్యాపారస్తులు సాధారణ రోజుల కంటే శుక్రవారం చాలా కష్టపడాల్సి వస్తుంది.  మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. సరైన డైట్ పాటించండి. జంక్ ఫుడ్ తినడం మర్చిపోండి. సోదరుడి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించమని సలహా. అతని ఆరోగ్యం క్షీణించవచ్చు. సామాజిక రంగంలో ఇతరులకు సహాయం చేసే అవకాశం మీకు లభిస్తే, మీ సామర్థ్యాన్ని బట్టి తప్పకుండా సహాయం చేయండి.

మీన రాశి (Pisces) 

శుక్రవారం నాడు సోమరితనం మంచిది కాదు. చురుకుగా ఉండండి. పూర్తి శక్తితో పని చేయండి. సహోద్యోగులతో సామరస్యంగా వ్యవహరించండి. చిరు వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. పాదాలలో వాపు వచ్చే అవకాశం ఉంది. మీకు సాధారణం కంటే ఎక్కువ వాపు ఉంటే, వైద్యుడిని సంప్రదించండి. ఇంటికి అనుకోని అతిథి రావొచ్చు, వారిని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి, ఇది కష్టపడి చదవాల్సిన సమయం, ఇది మీకు విజయాన్ని ఇస్తుంది.

Also Read: Mike Tyson Punches: విమానంలో పట్టరాని కోపంతో ఊగిపోయిన మైక్ టైసన్.. తోటి ప్రయాణికుడిని చితక్కొట్టాడు..  

Also Read: Horoscope Today April 22 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారిని తెలియని భయం కలవరపెడుతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News