IPL Delhi Capitals: దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ భయం మొదలైంది. కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో ఫోర్త్ వేవ్ రావొచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందా అన్న భయాలు, అనుమానాలు కలుగుతున్నాయి. అటు ఐపీఎల్‌ను కూడా కరోనా ఎఫెక్ట్ వెంటాడుతోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో ఓ ఆటగాడు కరోనా బారినపడ్డాడు. ప్రస్తుతం అతను ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా సోకిన ఆ ఆటగాడు ఎవరనేది గోప్యంగా ఉంచుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్ కేసు కలకలం రేపడంతో ఢిల్లీ టీమ్ మొత్తాన్ని క్వారెంటైన్‌లోకి పంపించారు. టీమ్ సభ్యులంరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పుణే షెడ్యూల్‌ను ఢిల్లీ టీమ్ రద్దు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20న పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఢిల్లీ-పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ నేపథ్యంలో ఈ మ్యాచ్ జరుగుతుందా జరగదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ నిర్వహణపై టెక్నికల్ కమిటీ రిపోర్ట్ మేరకు బీసీసీఐ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


ఇటీవల ఇదే ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన  ఫిజియో ప్యాట్రిక్ కూడా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్యాట్రిక్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక తాజా సీజన్‌లో ఢిల్లీ ఆట విషయానికొస్తే.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు 8వ స్థానంలో ఉంది. ఇప్పటివరకూ 5 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. మరో మూడింట ఓటమిని మూటగట్టుకుంది. ఢిల్లీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 9వ స్థానంలో, ముంబై ఇండియన్స్ జట్టు పదో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ముంబై బోణీ చేయలేదు. 



Also Read: Railway Ticket at Post offices: త్వరలో పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్ బుకింగ్


Telangana Job Notifications: నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్... వారం రోజుల్లో పోలీస్ రిక్రూట్‌మెంట్  నోటిఫికేషన్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook