IPL Final Gujarat Titans vs Rajasthan Royals: ఐపీఎల్ తుది ఘట్టానికి ఇంకా మరికొద్ది గంటలే సమయం ఉంది. దాదాపు నెల రోజులుగా ఉత్కంఠభరితంగా సాగుతున్న తాజా సీజన్ ఇవాళ ముగింపు దశకు చేరుకోనుంది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ గుజరాత్ టైటాన్స్-రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య తుది పోరు జరగనుంది. అటు లీగ్ మ్యాచ్‌ల్లో, ఇటు ప్లేఆఫ్స్‌లో సత్తా చాటిన ఈ రెండు జట్లు టైటిల్ పోరు కోసం నువ్వా నేనా అన్నట్లుగా ఫైనల్లో తలపడనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ ఐపీఎల్ ఫైనల్ నేపథ్యంలో వెదర్ రిపోర్ట్ కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ.. ఒకవేళ హఠాత్తుగా మబ్బులు కమ్ముకుంటే, వర్షం పడితే నెక్స్ట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. 


ప్రస్తుతం అహ్మదాబాద్‌లో వెదర్ :


అహ్మదాబాద్‌లో ఆదివారం (మే 29) వాతావరణం చాలా వేడిగా ఉండనుంది. పగటిపూట దాదాపు 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకానుంది. రాత్రి 8గం. సమయానికి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉంది. మ్యాచ్ సమయానికి 37 డిగ్రీలకు, మ్యాచ్ ముగిసే సమయానికి 33 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు దిగొచ్చే సూచనలు ఉన్నాయి. ఇప్పటికైతే అహ్మదాబాద్‌లో ఎటువంటి వర్ష సూచన లేదు. కానీ హఠాత్తుగా వర్షం పడితే... విజేతను నిర్ణయించడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి.


మ్యాచ్ రిజర్వ్ డే :


ఒకవేళ వెదర్ కారణంగా అసలు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే మరుసటిరోజు రిజర్వ్ డే ఉంటుంది.  రిజర్వ్ డే నాడు కూడా ఎక్స్‌ట్రా సమయంతో కలిపి మ్యాచ్ నిర్వహణ కోసం 5 గం. 20 నిమిషాల సమయం ఉంటుంది. ఒకవేళ ఈ సమయంలోనూ కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యపడకపోతే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. రాత్రి 1.20 గం. సమయానికి సూపర్ ఓవర్‌ ప్రారంభం కావాల్సి ఉంటుంది. వర్షం వల్ల గ్రౌండ్ చిత్తడిగా మారితే... సూపర్ ఓవర్ సమయానికి గ్రౌండ్, పిచ్‌ను సిద్ధం చేసి ఉంచుతారు.


ఒకవేళ వర్షం పడితే :


ఒకవేళ టాస్ తర్వాత మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకపోతే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. అదే జరిగితే... పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ విజేతగా నిలుస్తుంది.


Also Read: PM MODI AP TOUR: జూలై 4న ఏపీకి ప్రధాని మోడీ.. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా?  


Also Read:  MLC Ananthababu: హత్యకు గురైన కారు డ్రైవర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం.. ఎమ్మెల్సీ అనంతబాబును సేఫ్ చేస్తున్నారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook