IPL 2022 Prize Money: ఐపీఎల్‌ విజేతకు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

IPL 2022 Prize Money: ఐపీఎల్ 2022 తుది సమరానికి రెడీ అయింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైజ్ మనీ తదితర వివరాలు మీ కోసం.   

Edited by - ZH Telugu Desk | Last Updated : May 29, 2022, 10:59 AM IST
IPL 2022 Prize Money: ఐపీఎల్‌ విజేతకు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

IPL 2022 Prize Money: ఐపీఎల్ 2022 తుది దశకు చేరింది. ఫైనల్ విజేత ఎవరో నేడు తేలిపోనుంది. ఈ టైటిల్ పోరులో గుజరాత్‌ టైటాన్స్‌ (Rajasthan Royals), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) పోటీపడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదికైంది. ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన జట్టుకు (IPL 2022 Winner )ఎంత ప్రైజమనీ లభిస్తుందో తెలుసా? వచ్చే ఏడాది నుంచి ప్రైజ్ మనీని (Prize Money) 20-25% పెంచే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. 

ఐపీఎల్ 2022 ప్రైజ్ మనీ :
విజేత (Winner): 20 కోట్లు
రన్నరప్ (Runners-up): 13 కోట్లు
మూడో ప్లేస్ (Third-place): 7 కోట్లు
నాలుగో ప్లేస్ (4th place): 6.5 కోట్లు 

ఇతర ప్రైజ్ మనీ వివరాలు: 

**ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు అందించే ‘ఆరెంజ్‌ క్యాప్‌’ అవార్డుకు ఈ సారి రాజస్థాన్‌ ఆటగాడు బట్లర్‌కు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బట్లర్‌ 16 మ్యాచ్‌లు ఆడి మొత్తం 824 పరుగులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఆరెంజ్‌ క్యాప్‌ దక్కితే బట్లర్‌కు రూ. 15 లక్షలు ప్రైజ్‌మనీ లభిస్తుంది.

**ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ఇచ్చే ‘పర్పుల్‌ క్యాప్‌’ అవార్డు రేసులో హసరంగ (బెంగళూరు), చహల్‌ (రాజస్తాన్‌) ఉన్నారు. వీరిద్దరు చెరో 26 వికెట్ల చొప్పున తీశారు. ఫైనల్లో చహల్‌ ఒక వికెట్‌ తీస్తే అతనికి ‘పర్పుల్‌ క్యాప్‌ లభిస్తుంది. తద్వారా అతడికి రూ. 15 లక్షలు ప్రైజ్‌మనీగా లభిస్తుంది. 

Also Read: GT vs RR: ఐపీఎల్ పైనల్ ఎప్పుడూ ఓడిపోని హార్దిక్ పాండ్యా, ఈసారి ఆ అదృష్టం కలిసొచ్చేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News