IPL Full Schedule 2023: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ షెడ్యూల్‌ను వచ్చేసింది. మార్చి 31 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. 12 స్టేడియాల్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. మూడేళ్ల తర్వాత జట్లు తమ సొంత మైదానంలో ఆడనున్నాయి. ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్‌ను స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం మొదటి మ్యాచ్‌కు వేదిక కానుంది. చివరి లీగ్ మ్యాచ్ మే 21న జరగనుంది. అయితే ఐపీఎల్ 2023 ప్లేఆఫ్ మ్యాచ్‌ల తేదీలను బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2023లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి లీగ్ రౌండ్‌లో మొత్తం 10 జట్లు తలో 14 మ్యాచ్‌లు ఆడనున్నాయి. లీగ్ రౌండ్‌లో మొత్తం 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తరువాత ప్లే ఆఫ్స్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడనున్నారు. టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు హోమ్‌ గ్రౌండ్‌లో ఏడు మ్యాచ్‌లు.. ప్రత్యర్థి జట్టు గ్రౌండ్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడుతుంది.



మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి ఎడిషన్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇటీవలె ప్రకటించిన విషయం తెలిసిందే.  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో తొలి మ్యాచ్ మార్చి 4న జరగనుండగా.. ఫైనల్ మార్చి 26న జరగనుంది. ఆ తర్వాత ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఐపీఎల్‌తో క్రికెట్ పండుగ మొదలుకానుంది. గత సీజన్ మొత్తం భారత్‌లోనే నిర్వహించినా.. కొన్ని స్టేడియాల్లోనే నిర్వహించారు. ప్రేక్షకులను కూడా పరిమిత సంఖ్యలోనే అనుమతించారు. అయితే ఏడాది అన్ని స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుతుండడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. 


[[{"fid":"262822","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"IPL Full Schedule 2023 ","field_file_image_title_text[und][0][value]":"ఐపీఎల్ షెడ్యూల్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"IPL Full Schedule 2023 ","field_file_image_title_text[und][0][value]":"ఐపీఎల్ షెడ్యూల్"}},"link_text":false,"attributes":{"alt":"IPL Full Schedule 2023 ","title":"ఐపీఎల్ షెడ్యూల్","class":"media-element file-default","data-delta":"1"}}]]