IPL Live 2024, GT vs PBKS Live Score: ఐపీఎల్ 2024 సీజన్ 17వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్‌తో అహ్మదాబాద్ వేదికగా తలపడుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండు ఫోర్లు కొట్టి మాంచి ఊపుమీదున్న సాహాను రబాడా ఔట్ చేశాడు. మరో ఓపెనర్ కమ్ కెప్టెన్ గిల్ తన దూకుడును ప్రదర్శించాడు. కేన్ మామతో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. డేంజరస్ గా మారుతున్న ఈ జోడిని హార్పిత్ బ్రార్ విడదీశాడు. విలియమ్సన్ ను ఔట్ చేసి పంజాబ్ కు బ్రేక్ ఇచ్చాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గిల్, తివాతియా మెరుపులు..


మరోవైపు గిల్ వచ్చిన బాల్ ను వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపాడు. ఇతడికి సుదర్శన్ కూడా తోడవ్వడంతో గుజరాత్ స్కోరు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు గిల్. స్కోరు వంద పరుగులు దాటిన తర్వాత సుదర్శన్ ఔట్(33) అయ్యాడు. ఆ తర్వాత విజయ్ శంకర్ ఎంతసేపు క్రీజులో నిలవలేదు. మరోవైపు గిల్ ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. ఇతడికి తివాతియా మెరుపులు కూడా తోడవ్వడంతో టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. గిల్ 48 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 89 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మరోవైపు తివాతియా కేవలం 8 బంతుల్లోనే మూడు ఫోర్లు, సిక్సర్ తో 23 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. పంజాబ్ బౌలర్లలో రబాడా రెండు వికెట్లు తీశాడు. 


ఇరు జట్లకు కీలకం..


ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకమనే చెప్పాలి. ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడిన గుజరాత్ రెండింటిలో గెలుపొంది పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. మరోవైపు పంజాబ్ మూడు మ్యాచులు ఆడి.. అందులో ఒకటి గెలిచి రెండు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఏ జట్టు గెలిస్తే ఆ టీమ్ పైకి ఎగబాకే అవకాశం ఉంది. 


ఇరు జట్ల ఫ్లేయింగ్ 11 ఇదే..
పంజాబ్ జట్టు: 
శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ప్రభు సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్
గుజరాత్ జట్టు: 
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే.

 



Also read: IPL 2024 Updates: ఊపిరి పీల్చుకో ముంబై.. టీ20కా బాప్ వచ్చేస్తున్నాడు..!


Also read: Rishabh Pant: బుద్ధి మారని పంత్.. మరోసారి అలా చేస్తే అతడిపై వేటు పక్కా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి