GT vs DC Highlights: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ సంచలనం సృష్టించింది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుతంగా ఆడి గుజరాత్‌ టైటాన్స్‌కు బోల్తా కొట్టించింది. బౌలింగ్‌తో విరుచుకుపడిన ఢిల్లీ అనంతరం అతి స్వల్ప లక్ష్యాన్ని ఉఫ్‌ అంటూ ఊదేసి మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. అహ్మదాబాద్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడో విజయం సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: IPL KKR vs RR: బట్లర్‌ విధ్వంసంతో రాజస్థాన్‌ అద్భుత విజయం..నరైన్‌ శతకం వృథా


సొంత మైదానంలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌ పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమించింది. 8.5 ఓవర్లలోనే కుప్పకూలి 89 పరుగులు సాధించింది.  ఒక్క రషీద్‌ ఖాన్‌ మినహా టాపార్డర్‌ మొదలుకుని బౌలర్ల వరకు ఎవరూ కూడా 20కి పైగా పరుగులు సాధించలేకపోయారు. జట్టు తీవ్ర కష్టాల్లో ఉన్న సమయంలో రషీద్‌ ఖాన్‌ తన శక్తిన్నంతా కూడగట్టుకుని 31 విలువైన పరుగులు సాధించాడు.

Also Read: IPL RCB vs SRH Highlights: ఐపీఎల్‌ చరిత్రలోనే హైదరాబాద్‌ భారీ విజయం.. బెంగళూరు చెత్త ప్రదర్శన


వృద్ధిమాన్‌ సాహ (2), కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (8), సాయి సుదర్శన్‌ (12), డేవిడ్‌ మిల్లర్‌ (2), అభినవ్‌ మనోహర్‌ (8), రాహుల్‌ తెవాటియా (10), షారూఖ్‌ ఖాన్‌ (0), మోహిత్‌ శర్మ (2), నోర్‌ అహ్మద్‌ (1), స్పెన్సర్‌ జాన్సన్‌ (1) బ్యాట్‌ను కదిలించలేకపోయారు. ఢిల్లీ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ముకేశ్‌ కుమార్‌ 3 వికెట్లతో సత్తా చాటగా.. త్రిస్టన్‌ స్టబ్స్‌, ఇషాంత్‌ శర్మ రెండు వికెట్ల చొప్పున తీశారు. ఖలీల్‌ అహ్మద్‌, అక్షర్ పటేల్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.


పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై మ్యాచ్‌ ఆసక్తికరంగా జరిగింది. అతి స్వల్ప స్కోర్‌ను ఢిల్లీ సునాయాసంగా ఛేదించింది. 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 8.5 ఓవర్లలో 92 పరుగులు చేసి మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ ప్రదర్శనలో యువ సంచలనం జేక్‌ ఫ్రీజర్‌ మెక్‌గర్క్‌ నమోదు చేసిన 20 స్కోరే అత్యధికం కావడం గమనార్హం. పృథ్వీ షా (7), అభిషేక్‌ పరేల్‌ (15), షాయ్‌ హోప్‌ (19), కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (16), సుమిత్‌ కుమార్‌ (9) పరుగులు చేశారు. సందీప్‌ వారియర్‌ 2 వికెట్లు, స్పెన్సర్‌ జాన్సన్‌, రషీద్‌ ఖాన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.


బౌలింగ్‌ మాయ..
ఐపీఎల్‌ అంటేనే పరుగుల వరద. లీగ్‌లోనే అత్యధిక పరుగుల రికార్డులు ఈ సీజన్‌లోనే జరిగాయి. అన్ని జట్లు భారీగా స్కోర్లు నమోదవుతున్న వేళ ఢిల్లీ, గుజరాత్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ మాత్రం పూర్తి భిన్నం. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యంత స్వల్ప స్కోర్‌ ఇదే. రెండు జట్లు కలిపి రెండు వందల పరుగులు కూడా రాబట్టలేదు. పూర్తిగా బౌలింగ్‌కు సహకరించిన పిచ్‌పై గుజరాత్‌, ఢిల్లీ పరుగులు సాధించలేకపోయాయి. గుజరాత్‌ బ్యాటింగ్‌లోనూ.. ఢిల్లీ ఛేజింగ్‌లోనూ బౌలింగ్‌ కీలక పాత్ర పోషించింది. స్వల్ప స్కోర్‌ అయినా కూడా ఢిల్లీ విజయం కోసం కొంత శ్రమించాల్సి వచ్చింది. వందలోపు పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోవడం చూస్తుంటే పిచ్‌ ఎంతగా బౌలింగ్‌కు సహకరించిందో అర్థం చేసుకోవచ్చు.

ఇంకా రేసులోనే..
ఈ మ్యాచ్‌తో పాయింట్ల పట్టికలో ఢిల్లీ తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. మూడు విజయాలతో ఆరో స్థానంలో ప్రస్తుతం స్థిరపడింది. మూడు విజయాలు, మూడు పరాజయాలతో గుజరాత్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ రెండు జట్లకు ఇంకా ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఇంకా ఉన్నాయి. ప్రస్తుతమైతే గడ్డు పరిస్థితుల్లో ఉన్న ఈ జట్లు తర్వాతి మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరిస్తే లీగ్‌లో ముందడుగు వేసే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter