RCB vs KKR Live Score: విరాట్ కోహ్లీ శ్రమ వృథా.. కేకేఆర్ చేతిలో బెంగళూరు బోల్తా
KKR Won By 7 Wickets Against RCB: బ్యాటింగ్‌తో బీభత్సం సృష్టించిన విరాట్ కోహ్లీ శ్రమ వృథా కావడంతో ఆర్‌సీబీ మరో ఓటమిని చవిచూసింది. సమష్టి కృషితో సత్తా చాటిన కేకేఆర్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది.
RCB Vs KKR Live Score: సొంత మైదానంలో విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్ చేసినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోల్తా కొట్టింది. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 7 వికెట్లతో తేడాతో ఆర్‌సీబీ ఓడిపోయింది. పరుగులు రాబట్టడంలో విఫలమైన ఆర్‌సీబీ ప్రత్యర్థిని లక్ష్యం సాధించకుండా నియంత్రించలేకపోయింది. టాస్ నెగ్గి బౌలింగ్‌కు దిగిన కేకేఆర్ మ్యాచ్‌ను కూడా చేజిక్కించుకుంది. సమష్టి కృషితో సత్తా చాటిన కలకత్తా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలోఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఓపెనర్‌గా దిగిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. 59 బంతుల్లో 83; 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో చెలరేగి ఆడాడు. ఫాఫ్ డుప్లెసిస్ (8) వెంటనే మైదానం వీడగా కామెరూన్ గ్రీన్ (౩౩), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (28) పర్వాలేదనిపించగా అనూజ్ రావత్, రాజత్ పాటిదార్ మూడు చొప్పున పరుగులు తీశారు. ఆఖర్లో వచ్చిన దినేశ్ కార్తీక్ సిక్సర్లతో ఆటను ముగించాడు. బెంగళూరును పరుగులు రాబట్టకుండా కోల్‌కత్తా బౌలర్లు శ్రమించారు. మిస్‌ఫీల్డ్‌తోపాటు మరికొన్ని తప్పిదాలు చేయడం మినహా కేకేఆర్ బౌలర్లు చక్కటి బౌలింగ్ వేశారు. మిగతా వాళ్లను స్కోర్ చేయడంలో నియంత్రించారు. కానీ విరాట్ కోహ్లీని బ్యాటింగ్ విధ్వంసానికి అడ్డుకట్ట వేయలేకపోయారు. హర్షిత్ రానా, ఆండ్రె రస్సెల్ రెండు వికెట్లు పడగొట్టగా.. సునీల్ నరైన్ ఒక వికెట్ తీశాడు.
Also Read: RR vs DC Live: పరాగ్ విధ్వంసంతో రాజస్థాన్ అ'ద్వితీయ' విజయం.. ఢిల్లీకి తప్పని నిరాశ
సాధారణ లక్ష్యాన్ని కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు సులువుగా సాధించింది. బౌలింగ్‌లో సత్తా చాటగా బ్యాటర్లు కూడా సత్తా చాటడంతో సమష్టి కృషితో కేకేఆర్ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 16.5 బంతుల్లోనే 186 సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. వెంకటేశ్ అయ్యర్ 30 బంతుల్లో 50 (3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా.. సునీల్ నరైన్ 47 పరుగులతో సత్తా చాటాడు. శ్రేయర్ అయ్యర్ తనదైన బ్యాటింగ్‌తో 39 స్కోర్ చేయగా, ఓపెనర్ 30 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ సమష్టి కృషి కనబర్చడం విశేషం.
బ్యాటర్లు విఫలమైన వేళ బౌలర్లు కేకేఆర్‌ను కట్టడి చేయడంలో ఆర్‌సీబీ బౌలర్లు విఫలమయ్యారు. మొదటి నుంచి ప్రత్యర్థి బ్యాటర్లు రెచ్చిపోతున్నా నియంత్రించలేకపోయారు. వికెట్ పడగొట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అతికష్టంగా యశ్ దయాల్, మయాంక్ దగర్, విజయ్ కుమార్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఈ విజయంతో కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ చేసిన ప్రకటన వాస్తవంగా మారింది. 'ఆర్‌సీబీని గెలవనివ్వం' అని ఆయన చేసిన ప్రకటన నిజమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook