IPL Media Rights: భారీ ధరకు అమ్ముడుపోయిన ఐపీఎల్ మీడియా రైట్స్.. ఈసారి ఏ కంపెనీకో తెలుసా?
IPL Media Rights: IPL Media Rights 2022 to 2027 have been sold for Rs 43,050 Crores. కాసుల వర్షం కురిసే భారత క్రికెట్ టీ20 లీగ్ (ఐపీఎల్)లో మరోసారి వేల కోట్లు ఖజానాలో చేరే సమయం ఆసన్నమైంది.
IPL Media Rights 2022 to 2027 have been sold for Rs 43050 Crores: కాసుల వర్షం కురిసే భారత క్రికెట్ టీ20 లీగ్ (ఐపీఎల్)లో మరోసారి వేల కోట్లు ఖజానాలో చేరే సమయం ఆసన్నమైంది. ప్రతిష్ఠాత్మకమైన మీడియా హక్కుల కోసం నిర్వహించే ఈ వేలం సోమవారం సాయత్రం ముగియనుంది. 2023 నుంచి 2027 వరకు గాను నాలుగు ప్యాకేజీలలోని ఎ (ఇండియాలో టీవీ హక్కులు), బి (ఇండియాలో డిజిటల్ రైట్స్) హక్కులు రూ. 43,050 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం తెలుస్తోంది. టెలివిజన్ మరియు డిజిటల్ ప్రసార హక్కులను రెండు వేర్వేరు కంపెనీలు గెలుచుకున్నాయని నివేదికలు పేర్కొన్నాయి.
తాజా సమాచారం ప్రకారం ప్యాకేజీ 'ఎ' దాదాపుగా రూ. 23,575 కోట్లు (ఒక్కో మ్యాచ్ కు రూ. 57.5 కోట్లు), ప్యాకేజీ 'బి' రూ. 19,680 కోట్ల (రూ. 48 కోట్లు)కు అమ్ముడుపోయినట్టు తెలుస్తున్నది. వయాకామ్ (రిలయన్స్), డిస్నీ స్టార్, సోనీ నెట్వర్క్ మధ్య వేలం హోరాహోరిగా సాగుంతోందట. స్టార్, సోనీల మధ్యే అసలు పోటీ ఉన్నట్లు తెలుస్తున్నది. సోమవారం (జూన్ 13) సాయంత్రం వరకు దీని గురించి పూర్తి వివరాలు బయటకు వస్తాయి. 2017లో స్టార్ ఇండియా 2018-2022 కోసం రూ.16,347.50 కోట్లకు (టీవీ, డిజిటల్ ప్రసారాలు) ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో 2007-2018 వరకు ఐపీఎల్ ప్రసార హక్కులు సోనీ చేతిలోనే ఉండేవి.
ఎ, బి ప్యాకేజీకి వేలం ముగిసిన నేపథ్యంలో సి (ప్లేఆఫ్స్ తో పాటు కొన్ని ప్రత్యేక మ్యాచ్ లు), డి (ఉపఖండం ఆవల) ప్యాకేజీలకు వేలం జరుగుతుందని సమాచారం. నేటి సాయంత్రంతో ఐపీఎల్ మీడియా రైట్స్ వేలం ప్రక్రియ ముగియనుంది. సాయంత్రం బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది. మొత్తానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ మరియు నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్‌లను అధిగమించి ప్రపంచంలోనే రెండవ అత్యంత విలువైన క్రీడా లీగ్‌గా అవతరించింది.
Also Read: IND vs SA 2nd T20: ఆ ఒక్కడు తప్పితే.. టీమిండియాలో మరో వికెట్ టేకింగ్ బౌలర్ లేడు: గవాస్కర్
Also Read: Rishabh Pant: అందుకే ఓడిపోయాం.. ఇక మూడు మ్యాచ్‌లు గెలవాల్సిందే: పంత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.