IPL Updates: తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై రోహిత్ శర్మ ప్రశంసలు... త్వరలో టీమిండియా జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని ధీమా..
IPL Updates Rohit Praises Tilak Varma: తెలుగు కుర్రాడు తిలక్ వర్మను రోహిత్ శర్మ ప్రశంసల్లో ముంచెత్తాడు. తిలక్ వర్మను త్వరలోనే టీమిండియా జట్టులో చూస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
IPL Updates Rohit Praises Tilak Varma: ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. తిలక్ వర్మ బ్యాటింగ్ టెక్నింగ్, అతని ఆటతీరు బాగుందని కితాబిచ్చాడు. అంతేకాదు, త్వరలోనే తిలక్ వర్మ టీమిండియా జట్టులో అన్ని ఫార్మాట్స్‌లో చోటు దక్కించుకుంటాడని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. గురువారం (మే 12) చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు తిలక్ వర్మ. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ వర్మపై ప్రశంసలు కురిపించాడు.
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. 'తిలక్ వర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. మొదటిసారి ఐపీఎల్‌లో ఆడుతూ ఇంత కూల్‌గా ఉండటం సులువు కాదు. త్వరలోనే అతను టీమిండియా తరుపున అన్ని ఫార్మాట్స్‌లో ఆడుతాడని ఆశిస్తున్నా. అతనిలో మంచి టెక్నిక్ ఉంది. బాగా ఆడాలనే తపన ఉంది.' అంటూ తిలక్ వర్మపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్‌లోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ముంబై తరుపున విశేషంగా రాణిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో నిలకడగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 98 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో మొదటి రెండు వికెట్లు వెంట వెంటనే కోల్పోయి ముంబై కష్టాల్లో పడిన వేళ.. తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత రోహిత్, స్టబ్స్ వెంట వెంటనే ఔట్ అవగా... హృతిక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. చివరలో హృతిక్ ఔట్ అయినప్పటికీ టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించడం... తిలక్ నిలకడగా ఆడటంతో ముంబై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 34 పరుగులతో తిలక్ వర్మ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
గతంలో రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లో 5 సిక్సులు, 3 ఫోర్లతో 61 పరుగులు చేసి సత్తా చాటాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీపై 15 బంతుల్లో 3 ఫోర్లు బాది 22 పరుగులు చేశాడు. అతని ఆటతీరు అందరినీ ఆకట్టుకుంది. అప్పుడే ఎవరీ కుర్రాడు అని చాలామంది ఆరా తీశారు. హైదరాబాద్ చందానగర్‌కి చెందిన ఈ కుర్రాడు లింగంపల్లి క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ ఐపీఎల్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో ముంబై జట్టు అతన్ని రూ.1కోటి 70 లక్షలకు కొనుగోలు చేసింది.
Also Read: Horoscope Today May 13 2022: రాశి ఫలాలు.. ఇవాళ ఆ రాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook