Karate Kalyani: యూట్యూబ్ ప్రాంక్‌స్టర్‌పై కరాటే కల్యాణి దాడి.. నడిరోడ్డుపై రచ్చ రచ్చ... వీడియో వైరల్..

Karate Kalyani Attacks Prankster Srikanth Reddy: హైదరాబాద్ యూసుస్‌గూడ బస్తీలో కరాటే కల్యాణి, ఆమె అనుచరులు యూబ్యూట్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. శ్రీకాంత్ రెడ్డి కూడా కల్యాణిపై దాడి చేశాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2022, 07:40 AM IST
  • యూట్యూబ్ ప్రాంక్‌స్టర్‌ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కల్యాణి దాడి
  • మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నాడని దాడికి పాల్పడిన కల్యాణి
  • కల్యాణిని తిరిగి కొట్టిన శ్రీకాంత్ రెడ్డి.. వీడియో వైరల్...
Karate Kalyani: యూట్యూబ్ ప్రాంక్‌స్టర్‌పై కరాటే కల్యాణి దాడి.. నడిరోడ్డుపై రచ్చ రచ్చ... వీడియో వైరల్..

Karate Kalyani Attacks Prankster Srikanth Reddy: సినీ నటి కరాటే కల్యాణి యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడికి పాల్పడింది. ప్రాంక్ వీడియోల పేరిట మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నాడంటూ అతనిపై దాడి చేసింది. ఆమెతో పాటు మరికొందరు వ్యక్తులు శ్రీకాంత్ రెడ్డి వద్దకు వెళ్లి అతనితో గొడవకు దిగారు. మొదట కరాటే కల్యాణి శ్రీకాంత్ రెడ్డిని చెంపదెబ్బ కొట్టడంతో గొడవ మొదలైంది. ఆ తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఆమెను తిరిగి కొట్టడంతో గొడవ మరింత పెద్దదైంది. చినికి చినికి గాలివానగా మారిన ఈ గొడవతో నడిరోడ్డుపై రచ్చ రచ్చ జరిగింది. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

శ్రీకాంత్ రెడ్డి నివాసం ఉండే చోటుకు కరాటే కల్యాణి తన మనుషులతో వెళ్లింది. వెళ్లి వెళ్లగానే.. 'నువ్వు చేస్తున్న ప్రాంక్‌లు ఏంటి.. ఏం చేద్దామనుకుంటున్నావ్ సమాజాన్ని. కొడ్తా...' అంటూ ఆవేశంగా మాట్లాడింది. శ్రీకాంత్ రెడ్డిపై చేయి చేసుకుంది. ఇంతలో ఆమె వెనకాలే ఉన్న మరో వ్యక్తి ఆవేశంగా దూసుకొచ్చి శ్రీకాంత్ చెంప పగలగొట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి గురైన శ్రీకాంత్ కరాటే కల్యాణిపై చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో చంటిబిడ్డను ఎత్తుకుని ఉన్న కల్యాణి ఒక్కసారిగా కిందపడిపోయింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ మరింత ముదిరింది.

ఒక ఆడదానిగా నువ్వు చేస్తున్న దుర్మార్గాలను సహించలేకే నిన్ను కొట్టడానికి వచ్చామంటూ కరాటే కల్యాణి ఆవేశంగా మాట్లాడింది. నీకు అక్కాచెల్లెళ్లు లేరురా అంటూ నిలదీసింది. ఇవాళ నీ పని పడుతా.. స్టేషన్‌లో కూర్చోబెట్టి నాలుగు తన్నిస్తా అంటూ ఫైర్ అయింది. శ్రీకాంత్‌కి దేహశుద్ధి చేయడానికొచ్చామని... అతన్ని బట్టలూడదీసి కొట్టామని చెప్పుకొచ్చింది. గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టిస్తానంటూ అతన్ని హెచ్చరించింది. నువ్వు చేస్తున్న వీడియోలకి హిందువులంతా మూసుకొని కూర్చొంటారా అంటూ మండిపడింది.

ఈ గొడవంతా అక్కడే నిలబడి చూస్తున్నవారిపై కూడా కల్యాణి ఫైర్ అయింది. మీరు సమాజంలో బతకట్లేదా... ఆడపిల్లను నేను నిలబడి మాట్లాడుతుంటే చోద్యం చేస్తున్నారేంటి.. సిగ్గు, లజ్జ లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 100కి డయల్ చేయాలని డిమాండ్ చేసింది. శ్రీకాంత్ రెడ్డి ఇల్లు ఖాళీ చేయిస్తానని అతన్ని హెచ్చరించింది. ఈ క్రమంలో అతన్ని బూతులు తిట్టింది. కల్యాణితో గొడవలో శ్రీకాంత్ రెడ్డి చొక్కా చిరిగిపోయింది. 

డబ్బులు ఇవ్వనందుకే ఇలా దాడి చేసింది : శ్రీకాంత్ రెడ్డి

కరాటే కల్యాణి తన నుంచి డబ్బులు డిమాండ్ చేసిందని.. ఇవ్వనందుకే ఇలా దాడికి పాల్పడిందని యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. తాను ప్రాంక్ షూట్స్ చేస్తే ఆమెకేమీ ఇబ్బంది అని ప్రశ్నించారు. సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్లు చేసే నీవు నీతులు చెప్పడమేంటని ఫైర్ అయ్యాడు. నీవేమీ పత్తిత్తువు కాదని నీ బాగోతం మొత్తం తెలుసంటూ ఆవేశంగా మాట్లాడాడు. ఈ గొడవ తర్వాత కల్యాణి, శ్రీకాంత్ రెడ్డి ఒకరిపై ఒకరు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. 

 

Also Read: Horoscope Today May 13 2022: రాశి ఫలాలు.. ఇవాళ ఆ రాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది..  

Also Read: Sarkaru Vaari Paata Collections : సర్కారు వారి పాటతో మహేష్ బాబుకు బ్లాక్ బస్టర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News