IPL Qualifier 1 Gujarat Vs Rajasthan: తాజా ఐపీఎల్ సీజన్‌లో ఛాంపియన్ తరహా ప్రదర్శనతో అదరగొడుతున్న గుజరాత్ టైటాన్స్ జట్టు క్వాలిఫయర్-1 మ్యాచ్‌లోనూ దుమ్ము రేపింది. రాజస్తాన్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని మరో 3 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. చివరి ఓవర్‌లో గుజరాత్ విజయానికి 16 పరుగులు అవసరం కాగా... ప్రసిద్ధ్ వేసిన ఆ ఓవర్‌లో తొలి 3 బంతులను మిల్లర్ సిక్సర్లుగా మలిచాడు. దీంతో గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ టార్గెట్‌ను చేధించేందుకు బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వృద్దిమాన్ సాహా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కానీ ఆ తర్వాత ఏ దశలోనూ గుజరాత్‌ను రాజస్తాన్ నిలువరించలేకపోయింది. డేవిడ్ మిల్లర్ 5 సిక్సర్లు 3 ఫోర్లతో చెలరేగి కేవలం 38 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో మరో 3 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ విజయాన్ని అందుకుంది. 


గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 40 (27) పరుగులతో మిల్లర్‌కు చక్కని సహకారం అందించాడు. శుభమన్ గిల్ 35, మాథ్యూ వాడే 35 పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఒబెడ్ మెక్కాయ్ చెరో వికెట్ తీశారు. 


అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాట్స్‌మెన్‌లో జోస్ బట్లర్ 2 సిక్సులు, 12 ఫోర్లతో 89 (56) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ సంజూ శాంసన్ 3 సిక్సులు, 5 ఫోర్లతో 47 (26) పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో దేవత్ పడిక్కల్ (28) మినహా మిగతా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, సాయి కిశోర్,యశ్ దయాల్ తలో వికెట్ తీశారు. బౌలర్ రషీద్ ఖాన్ వికెట్లేమీ తీయనప్పటికీ 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం. 


ఈ మ్యాచ్‌లో గెలుపుతో గుజరాత్ టైటాన్స్ జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఓడిన రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ నెగ్గితే ఫైనల్లో మళ్లీ ఇవే రెండు జట్లు తలపడుతాయి. క్వాలిఫయర్ 2 మ్యాచ్ మే 27న జరగనుంది. అంతకుముందు, మే 25న లక్నో-బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది. ఇందులో గెలిచే జట్టు రాజస్తాన్‌తో క్వాలిఫయర్ 2లో తలపడుతుంది. 
 


 



Also Read: High Tension in Amalapuram: అమలాపురంలో హైటెన్షన్... ఎస్పీ వాహనంపై రాళ్ల దాడి.. ఆందోళనకారులపై లాఠీఛార్జి


Also Read:  Konaseema District Protests Live Updates: కోనసీమ జిల్లా పేరు మార్పుతో భగ్గుమన్న అమలాపురం.. విధ్వంసంపై స్పందించిన మంద కృష్ణ మాదిగ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook