Ajinkya Rahane Vs KKR: అజింక్యా రహానే.. ఈ పేరు టీమిండియా క్రికెట్‌లో వినిపించి చాలా రోజులైంది. టెస్టు జట్టులో రహానే స్థానం కోల్పోయిన తరువాత రహానేను అందరూ మర్చిపోయారు. దేశవాళీ టోర్నీల్లోనూ.. గత ఐపీఎల్ సీజన్‌లోనూ పెద్దగా రాణించకపోవడంతో ఇక రహానే పనైపోయిందకున్నారు. కానీ ఈ సీజన్‌లో చెన్నైకు మారిన తరువాత కొత్త రహానే కనిపిస్తున్నాడు. వేలంలో రహానేను రూ.50 లక్షలకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు అసలు తుది జట్టులో చోటు దక్కుతుందా..? అనే డౌట్‌ నుంచి.. ఇప్పుడు రహానే లేకపోతే చెన్నైకు కష్టమే అని స్థాయికి చేరాడు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం రాకపోగా.. తరువాతి ఐదు మ్యాచ్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎక్కువగా సంప్రదాయ షాట్లకే ప్రాధాన్యం ఇచ్చే రహానే.. ఈ సీజన్‌లో మాత్ర తన శైలిని పూర్తిగా పక్కన పెట్టేశాడు. బంతి పడటమే ఆలస్యం.. ఏ వైపు అవకాశం ఉంటే అటు వైపు సిక్సర్ మలుస్తున్నాడు. ఎక్కువగా పవర్ యూజ్ చేయకుండా.. బౌలర్ పేస్‌ను ఉపయోగించుకుంటూ టైమింగ్‌తో బౌండరీలు బాదుతున్నాడు. స్కూప్, ర్యాంప్ షాట్లు ఆడుతూ కొత్త రహానేను ఆవిష్కరిస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌పై కేవలం 27 బంతుల్లో 61 పరుగులు చేస్తే.. గాలివాటం అనుకున్నారు. 


ఆ తరువాత రాజస్థాన్‌పై 19 బంతుల్లో 31, ఆర్‌సీబీపై  20 బంతుల్లో 37 రన్స్‌తో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఇక ఆదివారం కోల్‌కోతాపై జరిగిన మ్యాచ్‌లో తన దూకుడు గాలివాటం కాదని నిరూపించాడు. కేవలం 29 బంతుల్లోనే 71 పరుగులు చేసి.. సీఎస్‌కేకు భారీ స్కోరు అందించాడు. రహానే జోరుతో ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు (235)ను నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌ల్లో రహానే 209 రన్స్ చేయగా.. 199 స్ట్రెక్‌రేట్‌ ఉండడం విశేషం. ఇప్పటివరకు చూసిన రహానేను ఒక ఎత్తయితే.. ఒక నుంచి మరో రహానేను చూడబోతున్నాం. మున్ముందు మరెన్ని విధ్వంసాలు సృష్టిస్తాడో ఈ వెటరన్ ప్లేయర్. 


Also Read: Bandi Sanjay Comments: వేట మొదలైంది.. వేటాడానికే పులి వచ్చింది: బండి సంజయ్  


టీమిండియాలో తిరిగి రావాలని రహానే తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అందుకోసమే తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నాడు. ప్రస్తుతం భారత జట్టులో కూడా సరైన మిడిల్ ఆర్డర్ ప్లేయర్ లేడు. శ్రేయాస్ అయ్యర్ గాయంతో దూరమవ్వడంతో వన్డే జట్టులోకి సూర్య కుమార్‌ యాదవ్‌ను తీసుకుంటే.. వరుసగా గోల్డెన్ డకౌట్లు అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యను టెస్టు జట్టులోకి తీసుకోవడం కష్టం. ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న రహానేకు సెలెక్టర్ల నుంచి మళ్లీ పిలుపువచ్చే అవకాశం ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లాండ్‌లో జరుగుతున్న నేపథ్యంలో రహానే అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. ఆసీస్ పేస్ బౌలర్లను రహానే చక్కగా ఎదుర్కొగలడని విశ్లేషకులు అంటున్నారు.  


Also Read: RCB vs RR Highlights: సూపర్ ఫైట్‌లో రాజస్థాన్‌పై బెంగుళూరు విక్టరీ.. సొంతగడ్డపై కోహ్లీ సేన మాయజాలం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి