Ajinkya Rahane Made a fastest 50 of IPL 2023 in just 19 Balls: ఐపిఎల్ 2023లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసిన మొనగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అజింక్య రహానే రికార్డ్ సృష్టించాడు. ఐపిఎల్ 2023 టోర్నీలో భాగంగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్ తో జరిగిన 12వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఓపెనింగ్ కి వచ్చిన అజింక్య రహానే.. వాంఖడే స్టేడియంలో బౌండరీలతో పరుగుల వరద పారించాడు. అజింక్య రహానే ఆడిన సంచలనాత్మక ఇన్నింగ్స్ అతడికి ఐపిఎల్ 2023 టోర్నీలో ఫాస్టెస్ట్ 50 రికార్డును కట్టబెట్టింది. వాంఖడే స్టేడియంలో అజింక్య రహానే పరుగుల వరద పారిస్తూ జూలు విధిల్చిన సింహంలా గర్జించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాలుగో ఓవర్‌లో ముంబై ఇండియన్స్ పేసర్ అర్షద్ ఖాన్‌ను 23 పరుగుల వద్ద ఒక సిక్స్ తో పాటు నాలుగు వరుస ఫోర్లతో చిత్తు చేశాడు. ఈ ఇన్నింగ్స్ 2008 నుండి రహానే  ఏడవ IPL ఫ్రాంచైజీని సూచిస్తుంది. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ఆరో ఓవర్‌లో పీయూష్ చావ్లా బౌలింగ్‌లో వరుస బౌండరీలతో కేవలం 19 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం విశేషం. అజింక్యా రహానే సాధించిన ఈ రికార్డుతో అతడు ఫుల్ ఫామ్ లోకి వచ్చినట్టే అని క్రికెట్ ప్రియులు ట్వీట్స్ చేస్తున్నారు. తమ ఫేవరైట్ క్రికెటర్ అజింక్య రహానే గురించి మీమ్స్ వైరల్ చేస్తున్నారు.












ఇది కూడా చదవండి : David Warner Not Out: యశస్వి జైశ్వాల్ క్యాచ్ పట్టినా.. డేవిడ్ వార్నర్‌కి ఔట్ ఇవ్వలేదు ఎందుకో తెలుసా ?


ముంబై ఇండియన్స్‌తో జరిగిన 158 పరుగుల ఛేదనలో అజింక్య రహానే ఆడిన సెన్సేషనల్ ఇన్నింగ్స్‌ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆరంభం నుంచే ఫుల్‌ఫామ్‌లో నిలబెట్టింది. అజింక్య రహానే దూకుడు మ్యాచ్ లో అవసరమైన రన్ రేట్ కంటే ఎక్కువ కరెంట్ రన్ రేట్ ఉండేలా చేసి ముంబై ఇండియన్స్ ని చెన్నై సూపర్ కింగ్స్ డామినేట్ అయ్యేలా చేసింది. ఒకానొక దశలో అజింక్య రహానేని కట్టడి చేయడం ముంబై ఇండియన్స్ బౌలర్లకు కత్తి మీద సాములా మారింది. చెన్నై దూకుడుని ఆపేందుకు ముంబై ఇండియన్స్ జట్టు ఐదుగురు బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకపోయింది. అలా చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో అజింక్య రహానే కీలక పాత్ర పోషించాడు.


ఇది కూడా చదవండి : Sanju Samson Stunning Catch: సింగిల్ హ్యాండ్‌తో సంజూ శాంసన్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook