CSK Vs DC Highlights: ప్రతి ఐపీఎల్‌లో ఫీల్డర్ల విన్యాసాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లను ఇప్పటికే చూశాం. అలాంటి మరో సూపర్ క్యాచ్‌ను ఢిల్లీ బౌలర్ లలిత్ యాదవ్ అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై లలిత్ యాదవ్ బౌలింగ్ వేయగా.. స్ట్రైక్‌లో అజింక్యా రహానే ఉన్నాడు. రహానే స్ట్రైట్ డ్రైవ్ ఆడగా.. వెంటనే స్పందించిన లలిత్ యాదవ్.. కుడి వైపునకు డైవ్ చేస్తూ ఒంటి చెత్తో అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను చూసి అంపైర్ కూడా ఆశ్చర్యపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండడంతో ఢిల్లీ కెప్టెన్ త్వరగా స్పిన్నర్లను రంగంలోకి దింపాడు. ఫామ్‌లో ఉన్న డేవిడ్ కాన్వే (10)ను అక్షర్ పటేల్ ఔట్ చేయగా.. అజింక్యా రహానే క్రీజ్‌లోకి వచ్చాడు. ఆ తరువాత రుతురాజ్ గైక్వాడ్‌ (24)ను కూడాప పెవిలియన్‌కు పంపించి చెన్నై దెబ్బ తీశాడు అక్షర్ పటేల్. కాసేపటికే మొయిన్ అలీ (7) ఔట్ కావడంతో చెన్నై కష్టాల్లో పడింది. ఈ సమయంలో జట్టును ఆదుకుంటున్న రహానే (21).. లలిత్ యాదవ్ బౌలింగ్‌లో స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. తక్కువ ఎత్తులో వచ్చిన క్యాచ్‌ను డైవ్ చేస్తూ.. లలిత్ యాదవ్ అద్భుతంగా అందుకున్నాడు. అంపైర్ కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. దీంతో నిరాశగా రహానే పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.


గత మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమైన లలిత్ యాదవ్.. ఈ మ్యాచ్‌కు తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. బౌలింగ్‌లో తన మొదటి రెండు ఓవర్లలో 11 పరుగులు ఇచ్చి ఆకట్టుకున్నాడు. మూడో ఓవర్‌లో మాత్రం శివమ్ ధుబే, అంబటి రాయుడు కలిసి మూడు సిక్సర్లు బాది 23 పరుగులు పిండుకున్నారు. దీంతో మొత్తం 3 ఓవర్లలో లలిత్ యాదవ్ 34 పరుగులు ఇచ్చి.. ఒక వికెట్ తీశాడు.


 




ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. దీంతో చెన్నై జట్టు 27 పరుగుల తేడాతో విజయం సాధించి.. ప్లే ఆఫ్ రేసుకు మరింత చేరువ అయింది. ఈ ఓటమితో ఢిల్లీ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. 


Also Read: MS Dhoni Six Video: ధోని సిక్సర్లు.. కూతురు జీవా సంబురాలు.. వీడియోలు చూశారా..!  


Also Read: IPL 2023 Points Table: టాప్-3లోకి దూసుకువచ్చిన ముంబై.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే..?   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి