MS Dhoni Knock helps Chennai Super Kings beat Delhi Capitals in IPL 2023: నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంత మైదానంలో అదరగొట్టింది. బుధవారం రాత్రి చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో గెలుపుపొందింది. చెన్నై నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనలో వార్నర్ సేన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులే చేసి ఓడిపోయింది. రిలీ రొసోవ్ (35; 37 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్‌ స్కోరర్‌. మనీశ్ పాండే (27), అక్షర్‌ పటేల్ (21) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో మతీష పతిరణ 3 వికెట్స్ తీయగా.. దీపక్ చహర్‌ 2 వికెట్స్ పడగొట్టాడు. ఈ విజయంతో చెన్నై ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువ కాగా.. ఓటమితో ఢిల్లీ దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచులో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. శివమ్ దూబె (25; 12 బంతుల్లో 3 సిక్సులు) టాప్‌ స్కోరర్‌. ఇన్నింగ్స్‌ చివరలో కెప్టెన్ ఎంఎస్ ధోనీ (20; 9 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్ (24), డేవాన్ కాన్వే (10).. స్టార్ ప్లేయర్స్ అజింక్య రహానే (21), అంబటి రాయుడు (23), రవీంద్ర జడేజా (21) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్‌ 3 వికెట్స్ తీయగా.. అక్షర్ పటేల్ 2 వికెట్స్ తీశాడు. కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్‌, లలిత్‌ యాదవ్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.


సాధారణ లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులు చేసి ఓటమిపాలైంది. రిలీ రోసౌ (37 ), మనీశ్ పాండే (27; 29 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. స్టార్ ప్లేయర్స్ డేవిడ్ వార్నర్ (0), మిచెల్ మార్ష్ (5) తీవ్రంగా నిరాశపరిచాడు. చెన్నై బౌలర్లలో మతీశ పతీరణ మూడు వికెట్లు తీయగా.. దీపక్ చహర్ రెండు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది. బ్యాటర్లు పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితం కావడంతో ఢిల్లీ వేగంగా పరుగులు చేయలేకపోయింది. 



ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచులలో 7 విజయాలతో 15 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. మరో విజయం సాధిస్తే చెన్నై ప్లే ఆఫ్స్ చేరినట్టే. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ ఆశలు మాత్రం ఆవిరయ్యాయి. ప్రస్తుత పరిస్థితులలో ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసులో లేదనే చెప్పాలి. చివరి మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలిచినా ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. 


Also Read: Raashii Khanna Hot Pics: శారీలో రాశి ఖన్నా.. నాభి అందాలతో చంపేస్తుందిగా! పిక్స్ వైరల్  


Also Read: Malaika Arora Navel Pics: 49 ఏళ్ల వయసులోనూ ఘాటు ఫొటోలు.. మలైకా అరోరా హాట్ పిక్స్ వైరల్!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.