Sanju Samson Fined: చెపాక్‌లో చెన్నైను 15 ఏళ్ల తరువాత ఓడించిన రాజస్థాన్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌పై జరిమానా పడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డుప్లెసిస్ తర్వాత జరిమానా గురైన రెండవ కెప్టెన్ అయ్యాడు. డుప్లెసిస్ మాదిరిగానే ఈ సీజన్‌లో శాంసన్‌కి ఇది మొదటి నేరం కావడంతో అతనికి రూ.12 లక్షల ఫైన్ పడింది. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు కెప్టెన్‌కు జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏ జట్టు అయిన స్లో ఓవర్‌ రేట్‌ను నమోదు చేస్తే.. మొదటి తప్పునకు కెప్టెన్‌కు రూ.12 లక్షలు, రెండవ తప్పుకు కెప్టెన్‌కు రూ.24 లక్షలు, మిగిలిన 10 మంది ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో ఆరు లక్షలు లేదా 25 శాతం జరిమానా విధిస్తుంది. ఒక సీజన్‌లో మూడోసారి కూడా స్లో ఓవర్‌ రేట్‌ నమోదైతే బౌలింగ్ జట్టు కెప్టెన్‌కు రూ.30 లక్షల ఫైన్‌తో పాటు ఒక మ్యాచ్ నిషేధం కూడా పడుతుంది. జట్టులోని ఇతర 10 మంది ఆటగాళ్లకు రూ.12 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తారు. 


2008 తర్వాత చెన్నైలో రాజస్థాన్ విజయం సాధించింది. మొదటి సీజన్ 2008లో 10 పరుగులతో చెన్నైను ఓడించిన రాజస్థాన్.. ఆ తరువాత మళ్లీ 15 ఏళ్ల తరువాత వారి సొంత గడ్డపై ఓడించడం విశేషం. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ డకౌట్ అయి నిరాశ పరిచాడు. అయితే బ్యాట్స్‌మెన్‌గా విఫలమైనా.. కెప్టెన్‌గా సక్సెస్ అయ్యాడు. చివరి ఓవర్‌ను తెలివిగా సందీప్ శర్మతో వేయించి ఫలితం రాబట్టాడు. ధోని వంటి ప్లేయర్లకు చక్కటి యార్కర్లు వేసి కట్టడి చేశాడు సందీప్ శర్మ. 


Also Read: CSK vs RR Highlights: తలైవా మ్యాజిక్.. రికార్డుస్థాయిలో వ్యూస్.. ధోని మెరుపులు ఎంతమంది చూశారంటే..


'ఇలాంటి గ్రౌండ్‌లో చాలా మంచుతో ఉన్నా తమ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పూర్తి క్రెడిట్ వాళ్లకు దక్కుతుంది. అందరూ ఆటగాళ్లు గెలవాలనే కసితో ఆడారు. చెన్నై గ్రౌండ్‌ నుంచి మేము మంచి జ్ఞాపకాలతో తిరిగి వెళ్లాలనుకుంటున్నాము. నిజంగా విజయం సాధించాలని కోరుకున్నాం. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడమ్ జంపాను బరిలోకి దింపడం ఫలితాన్ని ఇచ్చింది. మేం గేమ్‌ను త్వరగా ముగించాలని అనుకున్నాం.. కానీ అది చివరి ఓవర్‌కు కొనసాగింది..' అని మ్యాచ్ అనంతరం సంజూ శాంసన్ చెప్పాడు. 


Also Read: Minister Harish Rao: ఏపీలో రెండు పార్టీలు నోరు మూసుకున్నాయి.. వైసీపీ, టీడీపీలకు మంత్రి హరీష్‌ రావు చురకలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.