DC vs KKR: ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. రెండు మార్పులతో బరిలోకి! హిట్టర్లను బరిలోకి దింపిన కోల్‌కతా
Delhi Capitals vs Kolkata Knight Riders IPL 2023 28th Match Playing 11. ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా గురువారం 28వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి.
Delhi Capitals vs Kolkata Knight Riders Playing 11 and Dream11 Team: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా గురువారం 28వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ వర్షం కారణంగా గంట ఆలస్యంగా మొదలైంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు దేవ్ భాయ్ చెప్పాడు. మరోవైపు కోల్‌కతా ఏకంగా నాలుగు మార్పులు చేసింది. హిట్టర్లు లిట్టన్ దాస్, జాసన్ రాయ్ ఓపెనర్లుగా వచ్చారు.
ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ఈరోజు రాత్రి 7 గంటలకు టాస్ పడాల్సి ఉండగా.. అరుణ్ జైట్లీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో టాస్ ఆలస్యమైంది. ప్రస్తుతం వర్షం లేకున్నా.. మైదానం పరిసర ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. ఈ సీజన్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైన ఢిల్లీ ఇంతవరకు బోణీ చేయలేదు. మరోవైపు కేకేఆర్ మాత్రం 5 మ్యాచులలో 2 గెలిచింది.
కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింగ్ మినహా మిగతావారెవరు రాణించడం లేదు. దాంతో ఈ రోజు జేసన్ రాయ్, లిట్టన్ దాస్ ఓపెనర్లుగా పంపింది. ఢిల్లీ క్యాపిటల్స్‌లో డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ మినహా ఎవరు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడడం లేదు. సొంత మైదానంలోఆడుతున్న ఢిల్లీ.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి తొలి విజయాన్ని నమోదు చేయాలనీ చూస్తోంది.
తుది జట్లు:
కోల్‌కతా: జాసన్ రాయ్, లిట్టన్ దాస్, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), మన్‌దీప్ సింగ్, రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, కుల్వంత్ ఖేజ్రోలియా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
ఢిల్లీ: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, మనీశ్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, కుల్‌దీప్ యాదవ్, నోకియా, ఇషాంత్ శర్మ, ముఖేశ్ కుమార్.
Also Read: PBKS vs RCB: పంజాబ్‌పై బెంగళూరు విజయం.. విరాట్ కోహ్లీ సక్సెస్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.