Royal Challengers Bangalore beat Punjab Kings in Mohali: మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. దాంతో కోహ్లీ సేన 24 పరుగుల తేడాతో గెలుపొందింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (46; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), జితేశ్ శర్మ (41; 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. బెంగళూరు బౌలర్లలో మొహ్మద్ సిరాజ్ (4/21) అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ సక్సెస్ అయ్యాడు.
లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆదిలో షాక్ తగిలింది. ఓపెనర్ అథర్వ తైదే (4) వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (46) పరుగులు చేస్తున్నా.. మరో ఎండ్ నుంచి అతనికి సహకారం అందలేదు. బెంగళూరు బౌలర్లు చెలరేగడంతో పంజాబ్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. మాథ్యూ షార్ట్ (8), లియామ్ లివింగ్‌స్టోన్ (2), హర్‌ప్రీత్ సింగ్ భాటియా (13), సామ్ కరన్ (10), షారుఖ్ ఖాన్ (7) విఫలమయ్యారు.
ప్రభ్‌సిమ్రన్ సింగ్ వికెట్ పడిన తర్వాత మ్యాచ్‌ను ముందుకు నడిపే బాధ్యత జితేశ్ శర్మ (41) తీసుకున్నాడు. ప్రభ్‌సిమ్రన్ దూకుడు చూస్తే ఒకానొక దశలో పంజాబ్ విజయం ఖాయం అనిపించింది. ఈ సమయంలో మొహ్మద్ సిరాజ్ తన బౌలింగ్ మాయాజాలం చూపుతూ.. వరుస వికెట్లు తీశాడు. దాంతో విజయం బెంగళూరును వరించింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. హసరంగ రెండు వికెట్స్ తీశాడు.
ఈ మ్యాచులో అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (59; 47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), ఫాఫ్ డుప్లెసిస్ (84; 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0) డకౌట్ కాగా.. దినేశ్ కార్తిక్ (7) మరోసారి విఫలమయ్యాడు. మహిపాల్ లోమ్రోర్ (7), షాబాజ్ అహ్మద్ (5) నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ రెండు వికెట్స్ తీశాడు.
Also Read: Shraddha Das Hot Pics: వైట్ శారీలో శ్రద్ధా దాస్.. అదిరే ఒంపుసొంపులతో హాట్ ట్రీట్ ఇచ్చేసింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.