ఐపీఎల్ 2023 క్వాలిఫయర్ 2 మ్యాచ్.. గుజరాత్‌పై ముంబై గెలవాలంటే ఆ ప్లేయర్ జట్టులోకి రావాల్సిందే!
Aakash Chopra react on GT vs MI IPL 2023 Qualifier 2. క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు క్రిస్ జోర్డాన్‌ను పక్కన పెట్టి రిలే మెరిడిత్‌ను ఆడించాలని ఆకాశ్ చోప్రా సూచించాడు.
Aakash Chopra react on GT vs MI IPL 2023 Qualifier 2: ఐపీఎల్ 2023లో మరో కీలక సమరంకు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ ఐపీఎల్ 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దాంతో విజయం కోసమే ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి.
ముఖాముఖి పోరులో గుజరాత్ గుజరాత్‌పై ముంబై ఇండియన్స్ జట్టుదే పై చేయిగా ఉంది. అయితే ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు చెరొక విజయాన్ని సాధించాయి. సొంత మైదానం అయిన అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండటం గుజరాత్‌కు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. బలబలాల పరంగా గుజరాత్, ముంబై జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కీలక మ్యాచ్ కాబట్టి ఇరు జట్లకు టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా పలు సూచనలు చేశాడు.
క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు క్రిస్ జోర్డాన్‌ను పక్కన పెట్టి రిలే మెరిడిత్‌ను ఆడించాలని ఆకాశ్ చోప్రా సూచించాడు. జోర్డాన్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరొందినా.. ఇప్పటివరకు సరిగ్గా బౌలింగ్ చేయలేదు. ఈ సీజన్‌లో 10.06 ఎకానమీతో ఐదు గేమ్‌లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే తీశాడు. హృతిక్ షోకీన్ స్థానంలో కార్తీకేయ ఆడుతాడని ఆకాష్ చెప్పాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో మాదిరే కామెరూన్ గ్రీన్‌ను టాప్‌లో ఆడించాలని ఆకాష్ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్‌కు జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ మరియు ఆకాష్ మధ్వల్ బంతితో చెలరేగుతారని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో బెహ్రెన్‌డార్ఫ్ 14 వికెట్లు తీయగా, మధ్వల్ 23 వికెట్లు తీశాడు.
ముంబై ఇండియన్స్‌కే కాదు గుజరాత్ టైటాన్స్ జట్టుకు కూడా ఆకాశ్ చోప్రా సూచనలు ఇచ్చాడు. ఐపీఎల్ 2023 క్వాలిఫయర్ 1లో దారుణంగా విఫలమైన శ్రీలంక క్రికెటర్ డాసన్ షనకపై వేటు వేసి సాయి సుదర్శన్ ను జట్టులోకి తీసుకోవాలన్నాడు. యశ్ దయాల్ లేదా దర్శన్ నల్కండేలకు బదులు జోష్ లిటిల్‌ను జట్టులోకి తీసుకోవాలన్నాడు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలనుకుంటే హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా బౌలింగ్ చేయాలన్నాడు భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబైని ఐదుగురు బౌలర్లతో ఎదుర్కొవడం రిస్క్ అని ఆకాశ్ పేర్కొన్నాడు.
Also Read: Nothing Phone 2 Launch: నథింగ్ నుంచి మరో సూపర్ స్మార్ట్‌ఫోన్.. ఆకర్షణీయమైన డిజైన్, బలమైన బ్యాటరీ!
Also Read: MS Dhoni vs Rohit Sharma: ఎంఎస్ ధోనీకి వచ్చిన పేరు రోహిత్ శర్మకు దక్కలేదు: గవాస్కర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.