Sunrisers Hyderabad: తొలి మ్యాచ్‌కు ముందు మార్పు.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్
Bhuvneshwar Kumar To Lead Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐడెన్ మార్క్‌క్రమ్ నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో మొదటి మ్యాచ్‌కు దూరమయ్యాడు.
Bhuvneshwar Kumar To Lead Sunrisers Hyderabad: ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్తగా రెడీ అవుతోంది. గత రెండు సీజన్లలో చెత్త ప్రదర్శనతో నిరాశపర్చిన ఎస్‌ఆర్‌హెచ్.. ఈసారి ఎలాగైన పుంజుకోవాలని చూస్తోంది. ఈ సీజన్‌కు సఫారీ ఆల్‌రౌండర్ ఐడెన్ మార్క్‌క్రమ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. గత రెండు సీజన్లలో ఎనిమిదో స్థానంలో నిలిచిన హైదరాబాద్.. మార్క్‌క్రమ్ సారథ్యంలో దూసుకెళ్లాలని చూస్తోంది. ఏప్రిల్ 2వ తేదీన తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు మార్క్‌క్రమ్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
నెదర్లాండ్స్‌తో సౌతాఫ్రికా జట్టు వన్డే సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ కోసం మార్క్‌క్రమ్ జట్టుతో భాగం కావడంతో ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. దీంతో అతను గైర్హాజరు కావడంతో భువనేశ్వర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కెప్టెన్లందరూ ఐపీఎల్ ట్రోఫీతో ఫోటో షూట్ చేశారు. ఇందులో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా భువనేశ్వర్ పాల్గొన్నాడు.
కాగా గతంలో కూడా భూవీ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. 2019 సీజన్‌లో 6 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2022 సీజన్‌లో కూడా ఒక మ్యాచ్‌లో కెప్టెన్‌గా అవకాశం వచ్చింది. భువీ 2013 నుంచి ఎస్ఆర్‌హెచ్‌తోనే ఉన్నాడు. తన బౌలింగ్ నైపుణ్యంతో భూవీ ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు. అన్ని జట్లు బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను భయపెడితే.. సన్‌రైజర్స్ మాత్రం బౌలింగ్ ఎటాక్‌ను నమ్ముకుంటుందంటే దానికి కారణం భూవీనే. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 146 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్.. మొత్తం 154 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 19 పరుగులకే 5 వికెట్లు పడగొట్టడం అత్యుత్తమ ప్రదర్శన.
ఐడెన్ మార్క్‌క్రామ్ విషయానికి వస్తే.. ఐపీఎల్ 2021లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు మొత్తం 20 మ్యాచ్‌లు ఆడగా.. 527 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 6 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసి.. ఒక వికెట్ పడగొట్టాడు. ఇటీవల`సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కెప్టెన్‌గా సన్‌రైజర్స్ ఈస్టర్స్ కేప్ జట్టుకు కెప్టెన్‌గా మార్క్‌క్రమ్ వ్యవహరించాడు. తన కెప్టెన్సీ నైపుణ్యంతో విజేతగా నిలపడంతో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కూడా కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం.
శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జట్ల మధ్య పోరుతో ఐపీఎల్ సీజన్-16 ప్రారంభంకానుంది. ఆదివారం హైదరాబాద్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఏప్రిల్ 3న మార్క్‌క్రమ్ భారత్‌కు చేరుకుంటాడు. సన్‌రైజర్స్ రెండో మ్యాచ్ ఏప్రిల్ 7న లక్నో సూపర్‌జెయింట్‌తో జరుగుతుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: ఐడెన్ మార్క్‌క్రమ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జెన్సన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్‌హాక్ ఫరూకీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసేన్, అడ్రిచ్ క్లాసేన్, అడ్రిచ్ క్లాసేన్ మార్కండే, వివ్రంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, సన్వీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, మయాంక్ దాగర్, నితీష్ కుమార్ రెడ్డి, అకిల్ హొస్సేన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, అబ్దుల్ సమద్.
Also Read: IPL Updates: ఫుల్ కిక్కే కిక్.. క్రికెట్ పండుగకు వేళయా.. నేడే ఐపీఎల్ ప్రారంభం
Also Read: IPL 2023: డామిట్ కథ అడ్డం తిరిగింది.. కోట్ల ధర పలికి చివరికి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి